మేడ్చల్ హైవేపై ప్రమాదం.. కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ హోంగార్డు మృతి

మేడ్చల్ హైవేపై ప్రమాదం.. కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ హోంగార్డు మృతి
Kandlakoya Accident Today: విధులు నిర్వహిస్తోన్న ఓ ట్రాఫిక్ హోంగార్డుపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Kandlakoya Accident Today : మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కండ్లకోయ వద్ద లారీ ఢీకొని ట్రాఫిక్ హోంగార్డు శ్రీనివాస్ ప్రాణాలు విడిచారు. మేడ్చల్ జాతీయ రహదారి 44 కండ్లకోయ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ హోంగార్డుని బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
ఫ్యాన్స్‌కు కల్యాణ్ రామ్ ఫోన్ కాల్.. బాలయ్య సూపర్ హిట్ సాంగ్‌తో సర్ప్రైజ్..
