పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు.. బాలిక గర్భం దాల్చడంతో..!

author img

By

Published : Sep 24, 2022, 12:04 PM IST

teacher raped a student

Teacher Rape On Student: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు.. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Teacher Rape On Student: విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారితప్పాడు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కామంతో రగిలిపోయాడు. అభం శుభం తెలియని బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి.. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిట్టి తల్లి గర్భం దాల్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దమ్మపేట మండలంలోని ఓ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 10వ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పిచ్చయ్య విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ఆ బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించగా.. గర్భవతి అని నిర్ధారణ అయింది. దీంతో తల్లిందండ్రులు కూతురును నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వారికి చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు దమ్మపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వెంటనే కీచక గురువును విధుల నుంచి తొలగించి శిక్షించాలని మహిళా సంఘాలు, గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆది నుంచీ అభ్యంతరాలు..: మరోవైపు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులు విధులు నిర్వహించడంపై ఆది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే కారణాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ అశ్వారావుపేట మండలంలోని ఒక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఘటనతోనైనా అధికారులు మేల్కొని బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: డ్రగ్​ మాఫియా డాన్​ స్టీఫెన్​ అరెస్ట్​.. 40 ఏళ్ల మత్తు దందాకు పోలీసుల చెక్​..

ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.