Baby Boy Died News: విక్స్‌ డబ్బా మింగి ఊపిరాడక పసికందు మృతి

author img

By

Published : Sep 21, 2021, 12:46 PM IST

Updated : Sep 21, 2021, 1:08 PM IST

A 7-month-old boy has died of suffocation after swallowing Vicks in narketpally, nalgonda district

12:42 September 21

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

వారింట్లో వారసుడు పుట్టాడనే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే... ఆ మాయదారి విక్స్​ డబ్బాను పిల్లాడికి అందుబాటులోనే పెట్టకపోదురు ఆ కుటుంబసభ్యులు. పిల్లోడు కదా బొమ్మలతో పాటు దీనితో కూడా ఆడుకుంటాడులే అనుకుని ఉంటారు. కానీ విక్స్​ డబ్బా రూపంలో మృత్యువు 7 నెలల బాలుడిని వెంటాడింది.  

అప్పటివరకు బొమ్మలతో ఆడుకుంటున్న బాలుడు విక్స్​ డబ్బాను మింగేశాడు. దీంతో ఊపిరాడక పసికందు ఇబ్బంది పడి ఏడుస్తుంటే... ఇంట్లో వాళ్లు తనని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ దారి మధ్యలోనే బాలుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలోని నార్కట్​పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో చోటు చేసుకుంది.  

Last Updated :Sep 21, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.