వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు.. నవవధువు సహా ఆరుగురు గల్లంతు

author img

By

Published : Aug 30, 2021, 9:34 AM IST

Updated : Aug 30, 2021, 9:44 AM IST

6-members-drowned-in-water-while-crossing-stream-in-telangana

మొన్నటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో... వాగుల ఉద్ధృతి పెరిగి రెండు కార్లు కొట్టుకుపోయాయి. ఓ చోట నవవనధువు సహా మరో ముగ్గురు గల్లంతయ్యాడు. మరోచోట ఓ దివ్యాంగుడు కారుlో సహా కొట్టుకుపోయాడు.

భారీ వర్షం కురవడంతో వాగుల ఉద్ధృతికి వేర్వేరు ప్రాంతాల్లో రెండు కార్లు కొట్టుకుపోయాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగు వద్ద జరిగిన ఘటనలో నవవధువు, ఆమె బంధువులు ముగ్గురు గల్లంతయ్యారు.

ఇదే జిల్లా నవాబుపేట మండలం పుల్‌మామిడి వద్ద వాగు నీటిలో పడి మరో వ్యక్తి గల్లంతయ్యాడు. శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ఘటనలో ఒక దివ్యాంగుడు కారు సహా కొట్టుకుపోయారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఆ ఘటనల వివరాలిలా ఉన్నాయి.

6-members-drowned-in-water-while-crossing-stream-in-telangana
ప్రమాదంలో గల్లంతైన నవవధువు ప్రవల్లిక

పెళ్లి కుమారుడు, అక్క బయటకు దూకేశారు...

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, ఓ బాలుడు, మరో బంధువు రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్‌ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని వారు ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్‌ తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

6-members-drowned-in-water-while-crossing-stream-in-telangana
ప్రమాదం నుంచి బయటపడ్డ నవాజ్ రెడ్డి, రాధమ్మలు

వాగును అంచనా వేయలేక..

వాగు ఉద్ధృతి అంచనా వేయకపోవడంతో శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వద్ద వాగులో మరో కారు గల్లంతైంది. చేవెళ్ల మండలం కౌకుంట్లలో శుభకార్యంలో పాల్గొనేందుకు మోమిన్‌పేట్‌ మండలం ఎన్కెతల గ్రామానికి చెందిన సామల వెంకటయ్య(70), సాయి, ఎస్‌.శ్రీనివాస్‌ మధ్యాహ్నం వచ్చారు. వ్యక్తిగత పనుల కోసం కౌకుంట్లకు చెందిన బంధువులైన రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌తో కలసి కారులో ఎన్కెపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా డ్రైవర్‌ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు.

6-members-drowned-in-water-while-crossing-stream-in-telangana
దివ్యాంగుడైన సామల వెంకటయ్య కారులోంచి రాలేక గల్లంతు

కారు కొట్టుకుపోగా.. సాయి, రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌, ఎస్‌.శ్రీనివాస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. దివ్యాంగుడైన వెంకటయ్య కారులోంచి బయటకు రాలేక గల్లంతయ్యారు. మరో ఘటనలో నవాబుపేట మండలం పుల్‌మామిడి గ్రామం వద్ద పొలం నుంచి ఇంటికి తిరిగివస్తున్న చాకలి శ్రీను(40) వాగులో గల్లంతయ్యారు.

6-members-drowned-in-water-while-crossing-stream-in-telangana
వాగు వృద్ధృతికి గల్లంతైన చాకలి శ్రీను

ఇదీ చూడండి: Cruel Mother: పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?

Last Updated :Aug 30, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.