అమ్మపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని.. 18 రోజులు గడుస్తున్నా..

author img

By

Published : Nov 17, 2022, 3:23 PM IST

Keerthi

"లక్కీ తల్లీ.. ప్లీజ్​రా.. నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చేయ్.. మేం నీ కోసం గత 18 రోజులుగా భోజనం చేయకుండా కళ్లలో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నాం.. ప్లీజ్​ రా.. డాడీ నిన్ను ఏం అనడు.. మరెప్పుడు నిన్ను మందలించం నువ్వు ఇంటికి వచ్చేయ్ ".. ఈ మాటలన్నీ ఓ కన్నతల్లి అదృశ్యమైన తన కూతురు కోసం పలుకుతున్న మాటలు.. అమ్మ బుద్ధిగా చదువుకోమని చెప్పినందుకు ఓ విద్యార్థిని చేసిన నిర్వాకం భద్రాచలం వాసులకు కంటతడి పెట్టిస్తోంది. గత నెల 31వ తేదీన తల్లిదండ్రుల మీద కోపంతో పదో తరగతి చదువుతున్న కీర్తి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కావడంతో ఆ తల్లిదండ్రులు కనిపించిన ప్రతి ఒక్కరిని తమ గారాలపట్టి ఆచూకీ తెలపమని వేడుకుంటున్నారు.

Kirti missing case in Bhadrachalam: తల్లిదండ్రులు చదువుకోమ్మని మందలించినందుకు ఓ విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ఘటన భద్రాచలంలో జరిగింది. గత నెల 31న అమ్మనాన్నల మీద కోపంతో భద్రాచలంలోని కొర్రాజులగుట్ట కాలనీకి చెందిన 'శంకర్-సృజన' దంపతుల కుమార్తె కీర్తి.. ఇంటి నుంచి అలగి వెళ్లిపోయింది. 18 రోజులుగా బిడ్డ తిరిగి రాకపోవటంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. పదో తరగతి చదువుతున్న కీర్తి.. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిందని దగ్గరివారు అంటున్నారు.

Keerthi
Keerthi

బిడ్డ కోసం పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన తల్లిదండ్రులు.. ఎక్కడా ఆచూకీ లేకపోవటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా కీర్తి.. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలియక పోవటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బిడ్డకోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న దంపతులు.. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు.

"తల్లి లక్కీ నువ్వు ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చేయ్.. ప్లీజ్​రా నాన్న నిన్ను ఏం అనడు.. గత 18 రోజులు నుంచి మా కూతురు కనిపించడం లేదు. దయచేసి ఈ వీడియో చూసి.. నువ్వు ఇంటికి రా తల్లి.. ఎవరికైనా మా కూతురు ఆచూకీ తెలిస్తే ప్లీజ్ చెప్పండి. పోలీసులకు కూడా చెప్పాం.. వారు కూడా గాలిస్తున్నారు." -సృజన, కీర్తి తల్లి

అమ్మపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని.. 18 రోజులు గడుస్తున్నా..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.