afghan news: అఫ్గాన్​లో ఇరుక్కున్న మంచిర్యాల వాసి.. క్షేమంగా ఇంటికి చేర్చాలని కుటుంబ వినతి

author img

By

Published : Aug 18, 2021, 4:21 AM IST

manchiryal citizen strucked in Afghanistan

విమాన టికెట్లు సిద్ధమై.. మరికొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనుకున్న ఇంటి పెద్ద అనూహ్యంగా అఫ్గానిస్థాన్​లో చిక్కుకుపోవటంతో ఆయన కుటుంబం భయాందోళనలో మునిగిపోయింది. ఆయన్ను క్షేమంగా ఇంటికి చేర్చాలని కేంద్ర సర్కారును వేడుకుంటోంది.

అఫ్గాన్​లో ఇరుక్కున్న మంచిర్యాల వాసి..

అఫ్గాన్​ అల్లకల్లోలంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మన రాజన్న చిక్కుకున్నారు. పట్టణానికి చెందిన రాజన్న.. ఎనిమిదేళ్లుగా అఫ్గానిస్థాన్​లోని ఏసీసీఎల్​ సంస్థలో పనిచేస్తున్నారు. జూన్ 28న ఇండియాకు వచ్చిన రాజన్న... ఈ నెల 7న కాబుల్​కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈలోగా కాబూల్​ సహా... దేశమంతా తాలిబన్ల వశమైన నేపథ్యంలో... అక్కడి భయానక వాతావరణం నుంచి బయటపడే మార్గాలన్నీ మూసుకుపోయాయని రాజన్న వాపోయారు. ప్రస్తుతం తనతో పాటు.. కరీంనగర్​ జిల్లాకు ఒద్ధారానికి చెందిన వెంకన్న కూడా విధుల్లోనే ఉన్నారని తెలిపారు.

ఈ నెల 18న ఇండియాకు వచ్చేందుకు తమ సంస్థ టికెట్లు సిధ్దం చేసినా.. విమానాలు అందుబాటులో లేవని.. మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్​లో తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయంగా ఉందని... బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తెలిపారు. తనను సురక్షితంగా స్వగ్రామానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు.. కొద్ది రోజుల వరకు తమతో ఆనందంగా గడిపిన రాజన్న... భయానక పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. రాజన్నను క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షాను భార్య వసంత, కూతురు రమ్య వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

అఫ్గాన్​పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.