Agriculture sprayer పురుగుమందు పిచికారీకి రైతు వినూత్న ఆవిష్కరణ

author img

By

Published : Aug 22, 2022, 1:31 PM IST

Agriculture

Agriculture sprayer రైతులు అందరూ పంట మొక్కలకు వాడే పురుగు మందులను డబ్బాలో వేసి వీపున పెట్టుకొని పిచికారి చేస్తూ ఉంటారు. ఇది అందరూ కామన్​గా చేస్తున్న పని. కానీ అందుకు భిన్నంగా ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుందని ఒక రైతు ఆలోచించాడు. అందులో విజయం సాధించి, ఇప్పుడు కర్షకులంతా తనలా ఆలోచించేలా చేస్తున్నాడు. ఇంతకీ ఏంటా ఆలోచన.

Agriculture sprayer : పంట మొక్కలకు పురుగుమందు పిచికారీకి సంబంధించి తెలంగాణకు చెందిన ఓ రైతు వినూత్న ఆవిష్కరణ చేశాడు. సాధారణంగా అయితే మందు పిచికారీ డబ్బాను వీపునకు తగించుకొని రైతులు పిచికారీ చేస్తారు. కానీ నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చెందిన ఓ రైతు మాత్రం ఎద్దుల బండిపై ఓ మోటారును అమర్చి దాని ద్వారా పురుగుమందును పిచికారీ చేస్తున్నాడు.

రెండు పెద్ద డ్రమ్ములను ఓ ఎద్దులబండిపై ఉంచి వాటిల్లో క్రిమిసంహారక మందును నింపాడు. వాటికి మోటారును అమర్చి తద్వారా మందును మొక్కలకు పిచికారీ చేస్తున్నాడు. మామూలుగా అయితే స్ప్రేయర్‌ను రైతులు చేత్తో పట్టుకొని ఒక్కో మొక్కపై మందు పిచికారీ చేస్తూ వెళతారు. కానీ ఈ రైతు మాత్రం బండిపైనే రెండు స్ప్రేయర్లను అమర్చాడు.

అవి ఆటోమేటిక్‌గా తిరుగుతూ పిచికారీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాగా ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను నారాయణపేట కలెక్టర్‌ హరిచందన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆ రైతును ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, కూలీల అవసరం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.