పోడు భూముల సమన్వయ కమిటీల సమావేశాలపై హైకోర్టు స్టే

author img

By

Published : Sep 23, 2022, 5:37 PM IST

Updated : Sep 23, 2022, 6:50 PM IST

Highcourt

Highcourt stay on Waste land coordination Committees: పోడు భూములపై హక్కుల నిర్ధారణ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై నెలరోజుల పాటు సమన్వయ కమిటీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సమావేశాలపై స్టే ఉంటుందని తెలిపింది.

Highcourt stay on Waste land coordination Committees: పోడు భూములపై హక్కుల నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీలు వచ్చే నెల 21 వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. సమన్వయ కమిటీల్లో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రాతినిధ్యం కల్పంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. కమిటీలు ఏర్పాటు చేయాలంటూ ఈనెల 11న జారీ చేసిన జీవో 148 కొట్టివేయాలని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, రవికుమార్ వాదించారు.

పోడు భూములపై హక్కుల నిర్ధారణ ప్రక్రియలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతల ప్రమేయం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా.. పక్షపాతానికి దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల హెక్టార్లలోని పోడుభూమలపై అర్హుల హక్కుల పరిరక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు అక్టోబరు 21న తదుపరి విచారణ వరకు కమిటీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 23, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.