లెక్చరర్​ చేసిన పనికి, కాళ్లలో స్పర్శ కోల్పోయిన విద్యార్థిని

author img

By

Published : Aug 29, 2022, 8:05 AM IST

Updated : Aug 29, 2022, 10:40 AM IST

student lost legs after standing for 9 hours

student lost legs after standing for 9 hours గురువు అంటే విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాలి. వారికి ఎటువంటి బాధ వచ్చినా తల్లిదండ్రులులాగా నేను ఉన్నాను అన్న ధైర్యం ఇవ్వాలి. ఏది మంచో ఏది చెడో పిల్లలకు చెప్పాలి. అంతేగాని వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై కర్కశంగా ప్రవర్తించిన ఘటన సాంఘిక గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది.

student lost legs after standing for 9 hours: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘిక గురుకుల కళాశాలలో అవమానీయ ఘటన చోటుచేసుకుంది. సెలవులు ముగిసిన తర్వాత ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థినిని ఐదురోజులు పాటు వరుసగా 9 గంటలు తరగతి గది బయట నిలబెట్టారు. కాళ్లలో స్పర్శ కోల్పోయిన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పించారు.

student lost legs after standing for 9 hours in Sircilla : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన బీకాం చివరి సంవత్సరం చదువుతున్న నిహారిక జ్వరం కారణంగా రెండు రోజులు సెలవులు తీసుకొంది. లీవ్ ముగిసిన తర్వాత ఆలస్యంగా వచ్చినందుకు ఐదురోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిలబెట్టి కామర్స్​ లెక్చరర్​ శిక్షించారు. ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ ఆగి విద్యార్థిని అక్కడికక్కడే కూలబడింది. తోటి విద్యార్థినులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొని వెళ్లిన తరవాత కొంతసేపు ఉండి నిల్చోలేక అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె కాళ్లు స్పర్శ కోల్పోయాయని తెలిపారు.

ఈ ఘటన జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి దృష్టికి వెళ్లడంతో దీనిని సీరియస్​గా తీసుకున్నారు. సంబంధిత లెక్చరర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్దిని పట్ల అవమానీయంగా వ్యవహరించిన కామర్స్‌ లెక్చరర్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. ప్రిన్స్‌పల్‌ కల్యాణిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. నిహారిక జ్వరం రావడం వల్లనే లీవ్‌ తీసుకుంది, ఆ తర్వాత కామర్స్​ లెక్చరర్​ వ్యవహరించిన తీరుతో విద్యార్థిని ఆరోగ్యం మరింత చెడిపోయిందని తోటి విద్యార్థులు తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిహారిక
Last Updated :Aug 29, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.