డ్రైవరన్నకు హాట్సాఫ్​.. ప్రాణం మీదికొచ్చినా ప్రయాణికుల క్షేమం ఆలోచించి..

author img

By

Published : Nov 14, 2021, 5:21 PM IST

Updated : Nov 14, 2021, 5:41 PM IST

tsrtc bus driver saved passengers even he got heart attack in hyderabad

తమ ప్రాణాలు పోతున్నా.. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే జవాన్ల కథలు ఎన్నో వింటుంటాం.. చూస్తుంటాం. ఇక్కడ కూడా ఓ బస్సు డ్రైవర్​(tsrtc bus driver).. జవానులా తన బస్సులోని ప్రయాణికులను కాపాడాడు(bus driver saves passengers). ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించి కాదు.. ఓర్చుకోలేనంతగా వచ్చిన నొప్పిని సైతం భరించి..! అసలు ఏం జరిగిందంటే..

డ్రైవరన్నకు హాట్సాఫ్​.. ప్రాణం మీదికొచ్చినా ప్రయాణికుల క్షేమం ఆలోచించి..

విధి నిర్వహణలో తన ప్రాణాల మీదికి వచ్చినా.. తమను నమ్ముకుని బస్సెక్కిన ప్రయాణికుల క్షేమాన్ని కోరుకుని.. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్(tsrtc bus driver). ఒంట్లో ఓపిక లేకున్నా... సీట్లోనే కూలిపోతున్నా.. శక్తినంతా కూడగట్టుకుని ట్రాఫిక్​లో.. రన్నింగ్​లో.. ఉన్న బస్సును ఓ పక్కకు ఆపి పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడాడు(bus driver saves passengers). ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేటలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్​లోని ఎంజీబీఎస్​(mgbs bus station)లో హైదరాబాద్​ నుంచి వరంగల్​​(hyderabad to warangal bus)కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. బస్సులో దాదాపు పది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ బస్సు డ్రైవర్​గా.. సీహెచ్ శ్రీనివాస్, కండక్టర్​గా ప్రసన్న ఉన్నారు. కండక్టర్​ ప్రసన్న.. వెళ్దామని శ్రీనివాస్​కు సూచించింది. శ్రీనివాస్​ కూడా బస్సును స్టార్ట్​ చేశాడు. బస్సు ఎంజీబీఎస్​ నుంచి బయలుదేరింది. అప్పటికే ఒంట్లో కొంత నలతగా ఉందని కండక్టర్​ ప్రసన్నతో శ్రీనివాస్​ చెప్పాడు. కొంత దూరం వచ్చేటప్పటికీ కడుపులో నొప్పిగా ఉందంటూ.. ఇబ్బంది పడుతున్నాడు. అంతలోనే మరో నలుగురు ప్రయాణికులు కూడా బస్సెక్కారు. శ్రీనివాస్​ బాధను గమనించిన కండక్టర్​.. ఇబ్బందిగా ఉంటే బస్సును పక్కన ఆపమని సూచించింది. అంబర్​పేటకు చేరుకోగానే.. ఒళ్లంతా చెమటలతో శ్రీనివాస్ తడిపోయాడు. తాను డ్రైవర్​ సీట్లో కూర్చున్నాడే కానీ.. ఒపుకోలేనంత బాధ అనుభవిస్తున్నాడు.

కండక్టర్​ సాయంతో..

బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఆలోచించి.. శక్తినంతా కూడగట్టుకుని రోడ్డుపక్కన ఆపాడు. ట్రాఫిక్​కు ఇబ్బంది కాకుండా పూర్తిగా పక్కన ఆపాలని ప్రయత్నించినా తన వల్ల కాకపోవటంతో.. కొంచెం సైడ్​ తీసుకొని ఆపేశాడు. కండక్టర్​ ప్రసన్న వెంటనే స్పందించి.. ప్రయాణికుల సాయంతో డ్రైవర్​ సీటు నుంచి పక్కకు తీసుకొచ్చారు. 108కు ఎన్ని సార్లు ఫోన్​ చేసినా.. కాల్స్​ కలవలేదు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారటం గమనించి.. అటుగా వచ్చిన ఓ ఆటోలో హుటాహుటిన తార్నాక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శ్రీనివాస్​కు వైద్యం ప్రారంభించారు. సమయానికి వైద్యం అందటంతో ప్రస్తుతం డ్రైవర్​ శ్రీనివాస్​ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంబర్​పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం..

"బస్సు బయలుదేరినప్పుడే కొంచెం కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. కొంత దూరం వచ్చాక.. నొప్పి ఎక్కువైందన్నాడు. మరీ ఎక్కువగా ఉంటే.. పక్కన ఆపమని నేను చెప్పాను. ఆ తర్వాత మరో నలుగురు ప్యాసింజర్లను కూడా ఎక్కించుకున్నాడు. అంబర్​పేట ప్రాంతానికి వచ్చాక.. తన పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ఒళ్లంత చెమటలతో సీటులోనే కూలిపోతున్నాడు. ఆ సమయంలోనే ఓపికతో బస్సును పక్కన ఆపేశాడు. అంబులెన్స్​కి కాల్​ కలవకపోవటం వల్ల ఆటోలో ఆస్పత్రికి తీసుకొచ్చాం. పెద్దగా స్పీడులో లేకపోవటం.. శ్రీనివాస్​ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం." -ప్రసన్న, కండక్టర్

ఇదీ చూడండి:మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు... అదెలా సాధ్యం అనుకుంటున్నారా?

Last Updated :Nov 14, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.