ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

author img

By

Published : Oct 19, 2021, 6:09 AM IST

Updated : Oct 19, 2021, 9:59 PM IST

top news

21:49 October 19

టాప్​ న్యూస్​@10PM

2022 మార్చి 28న యాదాద్రి పునః ప్రారంభం

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం (Yadadri Temple Reopening) ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ (Cm Kcr Yadadri Tour) మహూర్తం తేదీని ప్రకటించారు.

ఏపీ బంద్​కు పిలుపునిచ్చిన తెదేపా

ఏపీలో తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ. ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి జగన్, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

రేపటి నుంచి 'ప్రజా ప్రస్థానం'

కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్దకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకుని ప్రార్థనలు చేశారు.

ఉత్తరాఖండ్​లో వరుణుడి బీభత్సం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో(Uttarakhand Rain News) ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాల కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో 44 మంది చనిపోయారు.

అలా చేయకపోయినా పర్లేదు

భారత జట్టు ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యాపై(Hardik Pandya News) కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev on Hardik Pandya). హార్దిక్​ బౌలింగ్​ చేయనంత మాత్రాన పొట్టి ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ఛాంపియన్​గా నిలిచే అవకాశాలు చేజారవని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

20:44 October 19

టాప్​ న్యూస్​@9PM

2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

 యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.మహాకుంభ సంప్రోక్షణ మూహూర్తం చినజీయర్‌స్వామి నిర్ణయించారని తెలిపారు. దీని కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపినట్లు సీఎం వెల్లడించారు.

'మహోత్కృష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి'

యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr on Yadadri Temple) వివరించారు. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ అని సీఎం చెప్పారు. 50 ఏళ్ల క్రితం బాల్యంలో యాదాద్రి(Yadadri)కి తొలిసారి వచ్చినట్లు సీఎం గుర్తుచేసుకున్నారు.

'రాహుల్ ఓ డ్రగ్ అడిక్ట్​'

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డ్రగ్ బానిస అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్. రాహుల్ గాంధీ.. మాదక ద్రవ్యాలను సరఫరా (Rahul Gandhi drug peddler) కూడా చేస్తారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.

'సలార్​'  ఫైట్​ సీన్ లీక్!

రెబల్​స్టార్ ప్రభాస్​ నటిస్తున్న 'సలార్'​ సినిమాలో ఓ సన్నివేశం లీక్(Salaar Leaked)​ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అయింది. ఈ సీన్​ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

 'మా కంటే పాక్ మెరుగ్గా కనిపిస్తోంది'

పాకిస్థాన్ జట్టులా టీమ్ఇండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(sehwag news). ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్(ind vs pak world cup 2021) మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించాడు.

19:53 October 19

టాప్​ న్యూస్​@8PM

  •  మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

 యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.మహాకుంభ సంప్రోక్షణ మూహూర్తం చినజీయర్‌స్వామి నిర్ణయించారని తెలిపారు. దీని కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపినట్లు సీఎం వెల్లడించారు.

  • తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల వీరంగం

ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. 

  •  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Cases) మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 7,643 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 77 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి.

  •  కాళ్లు నరికి కడియాలు చోరీ

పశువులను కాసేందుకు వెళ్లిన ఓ మహిళపై.. గొడ్డలితో విరుచుకుపడి హత్య చేశాడు ఓ దుండగుడు. మహిళ మృతి చెందిన తర్వాత ఆమె కాళ్లు నరికి.. వెండి కడియాలను అపహరించుకు పోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • రెండో రౌండ్​కు సింధు, శ్రీకాంత్

డెన్మార్క్ ఓపెన్​లో తొలిరోజు భారత్​కు శుభారంభం దక్కింది. మహిళల సింగిల్స్​లో సింధు, పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్, డబుల్స్​లో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్​కు చేరుకుంది.

19:03 October 19

టాప్​ న్యూస్​@7PM

  •   10 వేల మందితో సుదర్శన హోమం

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్... యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.  

 

  • మరో నిందితుడి అరెస్టు

     రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని హైదరాబాద్‌ సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో సాయికుమార్‌, కృష్ణారెడ్డి కీలకపాత్ర వహించినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణారెడ్డి స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు కాగా.... ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు.

  •  వరుణుడి బీభత్సం- 44కు చేరిన మృతులు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో(Uttarakhand Rain News) ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాల కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో 44 మంది చనిపోయారు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది.

  • ​పోలీస్​ను కిడ్నాప్​ చేసిన దొంగ

కారు పత్రాలు చూపించాలని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్​నే కిడ్నాప్(Traffic Police Kidnapped) చేశాడు ఓ వ్యక్తి. కారులోకి ఎక్కితే పత్రాలు చూపిస్తానని చెప్పి, పది కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

  • 12 ఏళ్ల చిన్నారి రూపొందించిన జెర్సీతో ఆ జట్టు!

12 ఏళ్ల వయసులో స్కూల్​కే పరిమితమవుతారు చాలామంది పిల్లలు. కానీ, ఓ చిన్నారి ఏకంగా తమ దేశ క్రికెట్ జట్టు జెర్సీనే రూపొందించింది. ఇంతకీ అది ఏ దేశం? ఆ చిన్నారి ఎవరు?.

18:01 October 19

టాప్​ న్యూస్​@6PM

  • యాదాద్రిలో సుదర్శన హోమం

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధి పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు.

  • కారు ఆపిన ట్రాఫిక్​ ​పోలీస్​ను కిడ్నాప్​ చేసిన దొంగ

కారు పత్రాలు చూపించాలని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్​నే కిడ్నాప్(Traffic Police Kidnapped) చేశాడు ఓ వ్యక్తి. కారులోకి ఎక్కితే పత్రాలు చూపిస్తానని చెప్పి, పది కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

  • షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్​కుంద్రా(raj kundra and sherlyn chopra) ఇటీవలే బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేసింది నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra raj kundra). తాజాగా ఈ వార్తలను ఖండించిన శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

  • కోహ్లీ సారథ్యంలో అది జరిగితే మరీ మంచిది

టీమ్​ఇండియా పొట్టి ప్రపంచకప్(T20 World Cup India Team)​ సాధించి 14 ఏళ్లు అవుతోందని భారత జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gambhir News)​ అన్నాడు. ఈ ఏడాదైనా కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా కప్​ గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల బోనస్‌!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​. 2020-21 సంవత్సరానికిగానూ బోనస్​ ఇచ్చింది. రూ. 7 వేల నెలవారీ జీతం ఆధారంగా దీనిని లెక్కించి ఇచ్చింది.

16:53 October 19

టాప్​ న్యూస్​@5PM

  • ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

దళితబంధు పథకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు (Mp Arvind Comments) చేశారు. రాష్ట్రం మొత్తం దళితబంధు అమలు అనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

  • రేపటి నుంచి 'ప్రజా ప్రస్థానం'

కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్దకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకుని ప్రార్థనలు చేశారు.

  •  'అమలు చేయలేకే ఈ కుట్రలు'

రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేసే సత్తా లేకనే తనపై కుట్రలు చేస్తున్నారు హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో(Huzurabad by election 2021) భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఈటల.. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

  •  కరోనా కంట్రోల్ అయినట్టేనా?

దేశంలో కరోనా (Covid 19 india) వ్యాప్తి తగ్గుతున్నట్లు స్పష్టమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఆర్ వ్యాల్యూ (r value Covid) ఒకటి లోపే ఉంటోందని తేలింది. అయితే.. ప్రధాన నగరాలైన కోల్​కతా, బెంగళూరులో ఈ సంఖ్య ఒకటికి మించిపోయింది. (r value Covid India)

  • పవన్​ కల్యాణ్​తో మంచు విష్ణు.. ఆ వార్తలకు చెక్!

ఇటీవల హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'అలయ్‌ బలయ్‌'(alai balai 2021) కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(pawan kalyan alai balai dattatreya), మంచు విష్ణు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

15:41 October 19

టాప్​ న్యూస్​@4PM

  •  జయరామ్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు

వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.  రెండేళ్ల క్రితం చిగురుపాటి జయరామ్‌ని హత్య చేసిన రాకేశ్‌రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. రాకేశ్‌రెడ్డితో కలిసి పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు, సాక్షులను బెదిరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

  • పాండోరా పేపర్స్​పై దర్యాప్తు షురూ

అక్టోబర్ 3న విడుదలైన పాండోరా పేపర్లపై దేశంలో విచారణ ప్రారంభమైంది. ఆర్​బీఐ, ఈడీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సహా.. పలు విభాగాల అధికారులతో కూడిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ దీనిపై దర్యాప్తు చేపట్టింది.

  • ' వాళ్లందరికీ ఏకే-47లు ఇవ్వాలి'

కశ్మీర్​లో స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని డిమాండ్ చేశారు భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను. అక్కడ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

  •  ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు

కళాశాలలో అడ్మిషన్ కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించిన కేసులో ఓ ఎమ్మెల్యేకు ఐదేళ్ల శిక్ష పడింది. విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఆయనకు రూ.8 వేల జరిమానా సైతం విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

  • ఆర్జీవీకి  మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్ 

'మా' సభ్యులపై కామెంట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma movies)కు గట్టిగా బదులిచ్చారు నటుడు మంచు మనోజ్. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

14:40 October 19

టాప్​ న్యూస్​ @3PM

  • రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారిని టీపీసీీీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి కలిశారు. తెరాస నేతలు, పోలీసులపై సీఈవోకు నిరోషా అనే యువతితో కలిసి ఫిర్యాదు చేశారు. 

  • యాదాద్రీశుడిని దర్శించుకున్న  కేసీఆర్

యాదాద్రిలో పర్యటిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారికి మొక్కుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు. 

  • ' ప్రతీ ప్రజాప్రతినిధికీ ఓ రేటు'

ప్రపంచలోనే యువ నాయకుడిగా రాజీవ్ గాంధీ పేరు తెచ్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ(Veerappa moily comments) అన్నారు. 18ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత అని గుర్తు చేశారు. అవినీతి నిర్మూలించేందుకు యూపీఏ పాలనలో లోక్ పాల్ బిల్లును తీసుకొస్తే.. దాన్ని అమలు చేయడంలో మోదీ విఫలం అయ్యారని విమర్శించారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ(Rajiv gandhi sadbhavana sabha 2021) ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.

  • దేవభూమిలో 16 మంది బలి

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వానల ధాటికి ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి.


  • ఆ హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు

జమ్ముకశ్మీర్​లో స్థానికేతరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టనుంది(jammu kashmir news). హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగనుంది.

13:48 October 19

టాప్​ న్యూస్​ @2PM

  • యాదాద్రీశుడి సన్నిధిలో కేసీఆర్

యాదాద్రిలో పర్యటిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారికి మొక్కుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు. 

  • 'చైనా కాలు దువ్వితే ఊరుకోం..'

రెండేళ్లలో సరిహద్దు రేఖ (India China Border News) వద్ద చైనా గస్తీని మరింత కట్టుదిట్టం చేసిందని ఈస్ట్రన్​ కమాండర్​ మనోజ్​పాండే అన్నారు. సున్నిత ప్రాంతాల్లో నిర్మాణాలను చేపడుతుందని చెప్పారు. వాటిపై ఇప్పటికే భారత్​ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

  • 'రైల్వే' అరుదైన ఘనత

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్​(ఎం​-క్యాప్​)(IRCTCM-Cap)​ క్లబ్​లో చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 300 శాతానికిపైగా లాభాలు గడించి.. ఈ మైలురాయి చేరుకున్న తొమ్మిదో ప్రభుత్వ రంగ సంస్థగా(పీఎస్​యూ)(PSU stocks news) నిలిచింది.

  • కోహ్లీ-శాస్త్రి విజయవంతమయ్యారా?

విరాట్‌ కోహ్లీ - రవిశాస్త్రి ద్వయం విజయవంతమైందా.. లేదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. దీంతో ఇద్దరూ తమ చివరి అవకాశంగా ఇప్పుడు జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌పైనే (T20 world cup 2021) దృష్టి సారించారు.

  • రియల్​లైఫ్​లో 'హిట్'​ కొట్టని కపుల్స్​

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య-సమంత(chaysam divorce) ఇటీవల విడిపోయి అభిమానులను షాక్​కు గురిచేశారు. అయితే ఇందుకు కారణం మాత్రం చెప్పలేదు. వీళ్లే కాదు గతంలో వివిధ కారణాలతో పలువురు స్టార్​ కపుల్స్​, ప్రేమ జంటలు కూడా విడిపోయారు. వారి గురించే ఈ కథనం..

12:49 October 19

టాప్​ న్యూస్​ @1PM

  • యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. కాసేపట్లో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా తిలకించారు. 

  • కుల, మతాలను రెచ్చగొడున్నారు

నేడు అధికారం కోసం కొందరు రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy comments) ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్​గాంధీ సద్భావన(Rajiv Gandhi sadbhavana sabha 2021) దినోత్సవం సభలో ఆయన పాల్గొన్నారు.

  • జొమాటోకు 'హిందీ' సెగ

ఫుడ్​ డెలివరి సంస్థ జొమాటో.. వివాదాస్పదన ఘటనలతో(zomato controversy in hindi) ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా.. తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి రెస్టారెంట్​ నుంచి ఫుడ్​ ఆర్డర్​ ఇవ్వగా.. తనకు రావాల్సినవి సరిగ్గా అందలేదు. దీంతో జొమాటో కస్టమర్​ కేర్​కు(zomato customer care) ఫోన్​ చేశాడు.

  • ఇలా అయితే విజయం కష్టమే

టీ20 ప్రపంచకప్​ వార్మప్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​తో టీమ్​ఇండియా (T20 worldcup 2021) విజయం సాధించినప్పటికీ.. భారత మాజీ వికెట్​ కీపర్​ పార్థివ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోవడం, భువనేశ్వర్ పేలవ ప్రదర్శన ముప్పును తెచ్చే అవకాశం ఉందని అన్నాడు.

  • మన రిలేషన్​పిప్​ గురించి ఆ రోజే చెప్తా

ప్రస్తుతం స్టార్​ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో జోరు మీదున్నా హీరోయిన్ పూజాహెగ్డే.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది. కథానాయకులు ప్రభాస్​, విజయ్​, ఎన్టీఆర్​, యశ్​పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

11:53 October 19

టాప్​ న్యూస్​ @12PM

  • ఆ విషయంపై కేటీఆర్ క్లారిటీ

కాంగ్రెస్​ పార్టీలో ఉన్న మంచి వ్యక్తి భట్టి విక్రమార్క అని.. కానీ ఆయనది అక్కడ ఏం నడవడం లేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్(Telangana Minister KTR) అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. హుజూరాబాద్​ ఉపఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమని స్పష్టం చేశారు.

  • కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యాదాద్రి(cm kcr visit yadadri)ని సందర్శించనున్నారు. . అటు ఆలయ ఉద్ఘాటనపై ఇప్పటికే చినజీయర్ స్వామితో చర్చించిన సీఎం... ఆ ముహూర్తాన్ని నేటి పర్యటనలో వెల్లడించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • బ్రిటిషర్లకు లొంగని బానిస రాణి

సిపాయిల తిరుగుబాటు అనగానే ఝాన్సీరాణి వీరగాథే గుర్తుకొస్తుంది. అదే సమయంలో ఝాన్సీతోపాటు మరో రాణి కూడా ఆంగ్లేయులపై అలుపెరగని తిరుగుబాటు చేసింది. తెల్లవారెంతగా తాయిలాలు విసిరినా లొంగకుండా.. నేపాల్‌ వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బానిస రాణి.. బేగం హజ్రత్‌ మహల్‌!

  • కొత్త మాక్​బుక్​ ప్రో లాంఛ్​

సరికొత్త డిజైన్​తో​ మాక్​బుక్​​ను తీసుకొచ్చింది యాపిల్(apple macbook pro). ఐదేళ్లలో తొలిసారి మాక్​బుక్​ను అప్​గ్రేడ్​ చేసింది యాపిల్​. మరి ఆ విశేషాలు, కొత్త మాక్​బుక్స్​ ఫీచర్స్​ చూసేయండి(apple macbook pro 2021)..

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

11:22 October 19

టాప్​ న్యూస్​ @11AM

  • కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హుజూరాబాద్‌(Huzurabad by election 2021)లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌(Minister KTR) ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. రేవంత్‌కు దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు. కొంతకాలం తర్వాత ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని...వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోందని తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా చెప్పారు. 

  • పాత బోగీలతో రైల్వే వినూత్న ప్రయోగం

వృథాగా పడి ఉన్న బోగీలతో ఆదాయం రాబట్టాలని భావించిన రైల్వే శాఖ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఆ బోగీలను (Restaurant on Wheels CSMT) రెస్టారెంట్లుగా మారుస్తోంది. ముంబయిలోని సీఎస్​ఎంటీలో ఏర్పాటు చేసిన ఈ హోటల్​కు ఆదరణ పెరగడం వల్ల మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది.

  • గుండెలో 4 అంగుళాల సిమెంట్​ ముక్క

వయసు పెరిగే కొద్దీ శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు రావడం సహజం. గుండె సమస్యలూ పెరుగుతాయి. అమెరికాలోని ఓ 56ఏళ్ల వ్యక్తికీ ఇదే జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత జరిగింది తెలిస్తే అందరు షాక్​ అవుతారు. ఆయన గుండె దగ్గర 4 అంగుళాల సిమెంట్​ ముక్కను చూసి వైద్యులే కంగుతిన్నారు. అదెలా సాధ్యం?

  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు జకోవిచ్ దూరం?

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో (Australian Open) తాను పాల్గొనకపోవచ్చని ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ తెలిపాడు. మెల్​బోర్న్​లో జరగనున్న ఈ గ్రాండ్​స్లామ్​కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ మేరకు జకోవిచ్ స్పందించాడు.

  • షారుక్​ సినిమాను వదులుకున్న సామ్?

బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ ఖాన్​తో సమంత (Samantha Akkineni and Shahrukh Khan) ఓ భారీ ప్రాజెక్టును వదులుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు నాగచైతన్యతో ఆమె పిల్లల్ని కనాలనుకోవడమే కారణమని సమాచారం.

09:33 October 19

టాప్​ న్యూస్​ @10AM

  • దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మంది​కి కరోనా (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 164 మంది మరణించారు. ఒక్కరోజే 19,470 మంది రికవరీ అయ్యారు.

  • విమానాల తయారీ కేంద్రంగా తెలంగాణ

తెలంగాణలో పూర్తిస్థాయి విమానాలు తయారు చేయడానికి ప్రత్యేక సమూహం(Aero Engines Clusters in Telangana) ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమెరికా, ఫ్రాన్స్​కు చెందిన రెండు సంస్థలు ఇంజిన్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పాయి. కొత్తగా మరో ఆరు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు రూ.5000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవనున్న ఈ సంస్థల ద్వారా 3000 మంది ఉపాధి పొందనున్నారు.

  • 'తెలియదు.. చెప్పలేను.. గుర్తులేదు'

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించిన కమిషన్.. సోమవారం రోజున సిట్ అధికారి సురేందర్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని విచారించింది. విచారణలో వాళ్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ విస్తుబోయింది.

  • స్టాక్ మార్కెట్ల జోరు

స్టాక్ మార్కెట్లు (Stocks today) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 62 వేల మార్క్ దాటింది. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 343 పాయింట్లకుపైగా లాభాలతో 62,109 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 100 పాయింట్లకుపైగా పెరిగి 18,577 వద్ద కొనసాగుతోంది.

  • ఆ మహిళా ఉద్యోగితో బిల్​ గేట్స్​ అలా..!

మైక్రోసాఫ్ట్​ వ్యస్థాపకుడు.. సంస్థలోని ఓ మహిళా ఉద్యోగిని ఫ్లర్ట్​ చేసేవారని వాల్ ​స్ట్రీట్​ జర్నల్​ వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఫ్లర్టింగ్​తో కూడిన ఈమెయిల్స్​ను ఆమెకు పంపేవారని పేర్కొంది. దీనిపై గేట్స్​కు సంస్థ వార్నింగ్​ కూడా ఇచ్చినట్టు వెల్లడించింది. దీనిపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట నిరాకరించినా.. పత్రిక ప్రచురించిన కథనం మాత్రం నిజమేనని సంస్థ అంగీకరించింది.

08:54 October 19

టాప్​ న్యూస్​ @ 9AM

  • విశాఖ నుంచి ముంబయికి గంజాయి

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయి(Cannabis) పట్టుబడింది. 240 కిలోల ఎండు గంజాయి(Cannabis)ని మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబయి తరలిస్తుండగా.. సంగారెడ్డి జిల్లా కంకోల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుల నుంచి 240 కిలోల గంజాయి(Cannabis), బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్​ను అరెస్టు చేశారు. 

  • తెలంగాణను పీడిస్తున్న విషజ్వరాలు

ఇప్పడిప్పుడే కరోనా కాస్త నెమ్మదించింది అనుకుంటే.. తెలంగాణను విషజ్వరాలు(Viral Fevers in Telangana) పట్టిపీడిస్తున్నాయి. 6 వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల మంది జ్వరాల బారిన పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలో జ్వరాల వ్యాప్తి అత్యధికంగా ఉంది.

  • భార్యను వేరు చేసిందని తల్లిని చంపిన కొడుకు

కొత్తగా పెళ్లై.. ఇంటికి వచ్చిన భార్యను పుట్టింటికి పంపించేసిందని, సొంత తల్లిపై(son kills mother) కక్ష పెంచుకున్నాడు ఆ కొడుకు(tamilnadu crime news). తాగి ఇంటికి వస్తే తిడుతోందని కోపం తెచ్చుకున్నాడు ఆ భార్త. దీంతో తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి ఆ మహిళను హత్య చేశారు. ప్రమాదవశాత్తు మరణించినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  • నైజీరియాలో కాల్పులు

నైజీరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో సుమారు 43మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సొకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్​లో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

  • స్వదేశంలో కల్లోలం.. అయినా మైదానంలో పోరాటం

తమ దేశంలో తాలిబన్ల పాలనతో కల్లోల పరిస్థితులు ఏర్పడినా.. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. భయాందోళనలో ఉన్న దేశ ప్రజలకు (T20 worldcup 2021) తమ ఆటతో కాస్త ఉపశమనాన్ని అందించేందుకు రంగంలోకి దిగుతున్నారు. పసికూన అనే ముద్రను చెరిపేసుకుని అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న ఈ జట్టు.. అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

08:01 October 19

టాప్​ న్యూస్​ @ 8AM

  • సైబర్‌ దోపిడీల్లో ఖాకీలకూ వాటాలు

కాల్‌ నేరాలకు ఆలవాలమైన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ కేటుగాళ్ల(Bharatpur Crime Gangs) గురించి దేశమంతా తెలుసు. రోజూ వేల మంది ఖాతాలు లూటీ చేస్తున్నా వీరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారన్నదే ప్రశ్న. శత్రుదేశంలో సర్జికల్‌ దాడులు చేయగలిగినప్పుడు సొంత దేశంలో అరాచకం సృష్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేయలేకపోవడమేంటనేది అర్థంకాని అంశం. దీనికి కారణం రాజకీయ ప్రమేయం. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే స్థానిక ప్రభుత్వం సైబర్‌ నేరగాళ్లను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.

  • మెరుపు వేగంతో సరిహద్దుకు బలగాలు

సరిహద్దులో చైనాను ఎదుర్కొనేందుకు (India China Border) భారత్​ దీటుగా చర్యలు చేపడుతోంది. మౌలిక వసతులను భారీగా మెరుగుపరచుకోవడం సహా అధునాతన నిఘా సాధనాలను ఉపయోగిస్తోంది. భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది.

  • 'కొవాగ్జిన్‌ టీకాపై మరికొంత సమాచారం'

కొవాగ్జిన్​ టీకాకు అత్యవసర వినియోగ అనుమతికి సంబంధించి డబ్ల్యూహెచ్​ఓ (WHO on Covaxin) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్​కు సంబంధించి మరికొంత సమాచారం రావాల్సి ఉందని తెలిపింది.

  • అతి జాగ్రత్తలతో అనర్థాలు తప్పువు!

కరోనా కారణంగా పరిసరాలను చాలా శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఇందుకోసం చుట్టుపక్కల బ్లీచింగ్​ పౌడర్​ చల్లడం చేస్తుంటాం. ఇక వ్యక్తిగత శుభ్రతకు వస్తే.. చేతులకు శానిటైజర్​ రాసుకోవడం షరా మామూలైంది. ఇలా రోజూ మనం చేస్తున్న వాటి వినియోగం శృతిమించితే కష్టం అని అంటున్నారు నిపుణులు.

  • తెలుగు సినిమాకు 'పండగ' జోష్

తెలుగు నాట కుర్రకారుకు పండగంటే సినిమానే. పండగొస్తుందంటే చూడాల్సిన కొత్త సినిమాల జాబితా కూడా సిద్ధమై పోతుంది. కరోనావల్ల రెండేళ్లుగా థియేటర్ల దగ్గర పండగ కళే కనిపించలేదు. కొన్ని సినిమాలు పండగలకు విడుదలైనా.. భయం భయంగానే చూశారు ప్రేక్షకులు. కానీ ఈసారి వ్యాక్సిన్‌ రావడంతో థియేటర్లకి ధైర్యంగా వెళుతున్నారు. పరిశ్రమ కూడా సినిమాల్ని అంతే ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది. ప్రధానంగా అగ్ర తారల సినిమాలు పండగలపై దృష్టిపెట్టాయి. సినిమాలకు పెట్టిన భారీ పెట్టుబడులు రాబట్టుకోవడానికి పండగే కీలకం. అందుకే రానున్న దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతికి కొత్త సినిమాలు వరుస కడుతున్నాయి.

06:49 October 19

టాప్​ న్యూస్​ @ 7AM

  • కలవరపెడుతున్న "ఆ రెండు గుర్తులు"

హుజూరాబాద్​ ఉప ఎన్నిక సమయం (huzurabad by election) దగ్గరపడే కొద్దీ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రతి ఓటు కీలకం కావడంతో.. ఓటర్ల మదిలో తమ గుర్తును (party symbol) ముద్రించేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నారు. గుర్తు మార్చుకుని బరిలోకి దిగిన ఈటలకు.. తన గుర్తును జనాళ్లోకి తీసుకెళ్లానా లేదా అనే భయం కలుగుతుంటే.. గతంలో జరిగిన ఎన్నికల్లో తమకు విజయాన్ని దూరం చేశాయి అనుకుంటున్న ఆ రెండు గుర్తులు మళ్లీ కనిపిస్తుండడంతో తెరాస శిబిరంలో కలవరం మొదలైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...

  • మాదక మహోత్పాతం

మనుషులను మత్తుకు బానిసలుగా మార్చే మాదకద్రవ్యాలతో దేశం చిత్తవుతోంది. దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్‌ మాఫియా నెట్‌వర్క్‌ అంతర్గత భద్రతకే ప్రమాదకరంగా పరిణమించింది. విస్తరిస్తున్న పార్టీ కల్చర్​తో యథేచ్చగా సాగుతున్న దందాకు అడ్డుకట్ట.. మత్తుకు బానిసలైన వారికోసం పునరావాస కేంద్రాల ఏర్పాటుతోనే 'నిషా ముక్త్‌ భారత్‌' సాక్షాత్కారం అవుతుంది.

  • టెలికాం సంస్కరణలతో లాభమెంత?

టెలికాం రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించింది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. అయితే.. ప్రధాన కంపెనీల మధ్య ఉన్న అహేతుక ధరలే అసలు సమస్య అన్నది నిపుణుల మాట.

  • నాటోపై రష్యా ప్రతీకార చర్యలు

నాటో కూటమితో విభేదాల నేపథ్యంలో రష్యా (NATO vs Russia) కీలక నిర్ణయం తీసుకుంది. నాటోతో తమ దేశ శాశ్వత మిషన్​ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మాస్కోలోని నాటో కార్యాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. (Russia NATO conflict)

  • సీనియర్​ నటుడుకు కౌంటర్

తన డ్రెస్సింగ్​ తీరుపై ఓ సీనియర్​ నటుడు చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు నటి అనసూయ. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.

03:01 October 19

టాప్​ న్యూస్​ @ 6AM

  • నేడు యాదాద్రికి కేసీఆర్​

యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇవాళ... యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించబోతున్నారు (cm kcr visit yadadi). అటు ఆలయ ఉద్ఘాటనపై ఇప్పటికే చినజీయర్ స్వామితో చర్చించిన సీఎం... ఆ ముహూర్తాన్ని నేటి పర్యటనలో వెల్లడించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • హుజూరాబాద్​ పరిధిలో దళితబంధు నిలిపివేత

రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. 

  • మత్తు వదిలించేందుకు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ తరచూ గంజాయి పట్టివేత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి (Growing ganja sales in Hyderabad). ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా... నిత్యం మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో గంజాయి విక్రయం, సరఫరా పెరగడంతో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

  • అత్తింటికే కన్నమేసింది..

అత్తమామలు ఆస్తి పంచడంలేదని సొంత ఇంటికే కన్నం వేసింది ఓ కోడలు. సాంకేతికత వాడుకొని సులభంగా పని పూర్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.

  • కశ్మీర్​లో వరుస హత్యలపై సమీక్ష

గతకొన్నిరోజులుగా జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక భేటీ నిర్వహించింది. అమిత్​ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కశ్మీర్​తో పాటు.. దేశవ్యాప్తంగా ఎదురవుతోన్న భద్రతా సవాళ్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో అమిత్‌ షా అంతర్గత సమీక్ష నిర్వహించారు.

  • కేరళ వరద విలయం

కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి(kerala floods today). వివిధ ఘటనల్లో రాష్ట్రంలో ఇప్పటివరకూ 38 మరణించారు.ఎడతెరపి లేని వానకు రహదారులు చెరువులుగా మారగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.

  • కొవిడ్‌ కోరలు వంచిన జపాన్

జపాన్​లో వెలుగుచూసిన కరోనా కేసుల ధాటికి.. టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణ సైతం కష్టమని భావించారంతా. కానీ.. ప్రస్తుతం అక్కడ కరోనా ఆనవాళ్లు లేనంతగా పరిస్థితి మారిపోయింది. అతి తక్కువ సమయంలో కేసులను భారీగా ఎలా తగ్గాయి? జపాన్ ప్రభుత్వం పాటించిన చర్యలేంటి మీరు తెలుసుకోండి..

  • టమాట ధరకు రెక్కలు

టమాట ధరలు (Tomato rate today) ఆకాశాన్నంటుతున్నాయి. మెట్రో నగరాల్లో సోమవారం కేజీ టమాటాల ధర రూ. 93కు చేరింది. హోల్​సేల్​గానూ రేట్లు మండిపోతున్నాయి.

  • ప్రాక్టీస్​ అదిరింది

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన వార్మప్ మ్యాచ్​లో అద్భుత విజయం సాధించింది టీమ్ఇండియా. ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించింది.

  • మరో వెబ్​ సిరీస్​కు సమంత గ్రీన్​ సిగ్నల్​!

ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో(samantha family man 2 release date) అలరించిన హీరోయిన్ సమంత(samantha movies) మరో వెబ్​సిరీస్​ చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని తెలుస్తోంది. ఇది తెలుగులో తెరకెక్కనుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Last Updated :Oct 19, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.