Top News: టాప్ న్యూస్​ @9PM

author img

By

Published : May 14, 2022, 8:58 PM IST

టాప్ న్యూస్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'

Amith shah Comments: ప్రజా సంగ్రామయాత్ర రెండో విడత ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్​షా పిలుపునిచ్చారు.

  • 'కాంగ్రెస్​కు, తెరాసకు ఇచ్చారు.. భాజపాకూ ఒక్క ఛాన్స్​ ఇవ్వండి.. ప్లీజ్​.. ప్లీజ్​..'

Bandi Sanjay Comments: ప్రజాసంగ్రామయాత్ర రెండో విడత ముగింపు సభలో తెరాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నానని బండి సంజయ్​ తెలిపారు.

  • 'క్లబ్​లు, పబ్​లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు'

KTR Comments in Haliya: సాగు, తాగు నీరులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. రైతులకు ఏదో చేస్తామంటూ కొందరు వస్తుంటారని.. వాళ్లను నమ్మొద్దని హితవు పలికారు.

  • 'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్‌ రెడ్డి 9 ప్రశ్నలు

Revanth Questions to Amit Shah: మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

  • ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్​లో విభజన అంశాలకు సంబంధించి వివాద పరిష్కార ఉపసంఘం ఈ నెల 25న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానుంది.

  • త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్​ రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్​ దేవ్​ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్​ ఎస్​ఎన్​ ఆర్యకు శనివారం తన రాజీనామా లేఖను అందించారు. త్రిపురలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాండ్​ ఆదేశించినట్లు తెలిపారు.

  • చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

Char Dham Yatra: ఈ ఏడాది చార్​ధామ్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల వీరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

  • కాంగ్రెస్ చింతన్​ శిబిర్​లో కీలక అంశాలపై చర్చ

Chintan Shivir: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు.

  • చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!

XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలం కావడమే గాక, ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్​పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • ఆర్టీసీ క్రాస్​రోడ్​ థియేటర్​లో 'నమ్రత' సందడి

'సర్కారు వారి పాట' చిత్రం ప్రదర్శితమవుతున్న ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని సుదర్శన్ థియేటర్​లో మహేశ్ బాబు సతీమణి నమత్రా శిరోద్కర్ సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన ఆమె... అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.