TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM

author img

By

Published : May 14, 2022, 2:59 PM IST

టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

Char Dham Yatra: ఈ ఏడాది చార్​ధామ్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల వీరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

  • 'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్‌ రెడ్డి 9 ప్రశ్నలు

Revanth Questions to Amit Shah: మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు.

  • 'ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాషను మరవొద్దు'

Vice President in Graduation Ceremony: మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవొద్దని స్పష్టం చేశారు.

  • 'ఐదేళ్లు కరవొచ్చినా తాగునీటి కొరత ఉండదు'

KTR laid Foundation stone for Sunkishala Project: ఐదేళ్లు కరవు వచ్చినా... హైదరాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది ఉండదని మంత్రి కేటీఆర్​ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ వద్ద సుంకిశాల ఇన్​టెక్‌ వెల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందన్నారు.

  • 'తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడతారా..?'

ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గన్నీ సంచులు సరిపడా ఉన్నాయని మంత్రి తెలిపారు. తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు.

  • 'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'..

Dwarf person marriage: పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉత్తర్​ప్రదేశ్​ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్​ మన్సూరీ. పెళ్లి కావట్లేదని ఏడాది క్రితం వార్తల్లో నిలవగా.. ఓ యువతి ముందుకొచ్చింది. అయితే, ఏడాదిగా వివాహం చేయకపోవటంపై విసుగు చెందిన అజీమ్​.. ఇప్పుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు.

  • ట్రెండ్ మార్చిన సాధువులు..

Sadhu saints: సాధువులు ట్రెండ్ మార్చారు. మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లో అఖిల భారతీయ అఖాడా పరిషత్​ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ బెర్తు కష్టమేనా?

IPL 2022 RCB Playoffs: ఈ ఐపీఎల్ సీజన్​లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ సారి బెంగళూరు జట్టుతో సహా మిగతా టీమ్​ల పరిస్థితి ఇప్పుడెలా ఉంది తెలుసుకుందాం..

  • 'కేజీఎఫ్​ 3' షురూ అయ్యేది​ అప్పుడే..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. కన్నడ రాకింగ్​ యశ్​, బాలీవుడ్ భాయ్​ సల్మాన్​ ఖాన్​ నటించనున్న కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

  • అక్కడ విజయ్​తో కలిసి చిల్​ కొట్టా: అనన్య పాండే

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్‌'తో తెలుగువారికి పరిచయమవుతున్నారు బాలీవుడ్‌ నటి అనన్య పాండే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.