TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : May 11, 2022, 8:58 PM IST

TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఆ క్వారీల్లో మైనింగ్‌ ఆపాలని ఎన్జీటీ ఆదేశం

NGT on Illegal Mining: పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో మైనింగ్‌ ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. తెలంగాణలో స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులపై ఇవాళ ఎన్జీటీ విచారణ చేపట్టింది.

  • కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులపై తెలంగాణ అభ్యంతరం..

కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని కేంద్ర జలసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్​కు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

  • 'సమస్యల వలయంలో రాష్ట్రం.. ఫామ్​హౌజ్​లో కేసీఆర్'

Bandi Sanjya Comments On Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయంలో కూరుకుపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది.

  • వైద్యసిబ్బందిపై మంత్రి హరీశ్​రావు ఫైర్​..

Harish Rao Fire on Doctors: నార్సింగ్​ యూపీహెచ్​సీ వైద్య సిబ్బందిపై మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. ఓపీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. పని తీరు మెరుగుపర్చుకోవాలని మందలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • మళ్లీ మారిన "అసని" దిశ.. అంతర్వేదిని వెతుక్కుంటూ తీరం వైపు!

Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

  • దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే

sedition cases: దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తైయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని స్పష్టం చేసింది.

  • వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!

Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.

  • శ్రీలంక కొత్త ప్రధాని కోసం చర్చలు.. రంగంలోకి సైన్యం

శ్రీలంక ప్రధాని రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహింద రాజపక్సను అరెస్టు చేయాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

  • అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!

IPL 2022 Uncapped players: ఐపీఎల్​ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్‌లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

  • రెండోసారి సంజన సీమంతం.. ఈ సారి భర్త పద్ధతిలో..!

హీరోయిన్​ సంజన గల్రానీ సీమంతం గ్రాండ్​గా జరిగింది. తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకున్న ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్​గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.