Top news: టాప్ న్యూస్ @7PM

author img

By

Published : May 11, 2022, 6:57 PM IST

Top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఆ క్వారీల్లో మైనింగ్‌ ఆపాలని ఎన్జీటీ ఆదేశం

తెలంగాణలో స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో మైనింగ్‌ ఆపాలని అధికారులను ఆదేశించింది.

  • "మహిళా ఉద్యోగులకు 'మూడోసారీ' ప్రసూతి సెలవులు.. కానీ..."

Third Maternity Leave: మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. విడాకులు తీసుకున్న అనంతరం.. మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చిన ఉద్యోగినులు ఈ సెలవులను పొందవచ్చు.

  • కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులపై తెలంగాణ అభ్యంతరం..

కర్ణాటక అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై రాష్ట్ర సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

  • మళ్లీ మారిన "అసని" దిశ.. అంతర్వేదిని వెతుక్కుంటూ తీరం వైపు!

Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

  • హ్యాకర్స్​ కా బాప్ హైదరాబాద్​ పోలీస్.. 'ఎలాంటి కేసైనా ఛేదిస్తాం'

Hyderabad CP CV Anand: ఎలాంటి కేసులనైనా హైదరాబాద్ పోలీసులు ఛేదించగలుగుతున్నారని నగర సీపీ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. హ్యాకర్స్​ కేసుల విషయంలో దేశంలో ఎవరూ పట్టుకోలేదని మొదటిసారిగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నట్లు సీపీ వివరించారు. సైబర్ క్రైం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.

  • రాష్ట్రంలో విస్తారంగా పెంచిన ఆ మొక్కలపై నిషేధం.. అవి అంత డేంజరా..?

రాష్ట్రంలోని ప్రధాన రహదారుల వెంట, డివైడర్లలో.. ఎక్కడ చూసినా ఆకుపచ్చగా, ఏపుగా ఎదిగే మొక్కలు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ మొక్కలపై నిషేధం విధించారు.

  • నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళతాం: సజ్జల

Sajjala on Narayana bail: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్టు చేయించేవారన్నారు.

  • ఎయిర్​పోర్ట్​లో 62 కిలోల హెరాయిన్​ సీజ్​.. విలువ రూ.430 కోట్ల పైనే!

Drugs seized in delhi airport: దిల్లీ విమానాశ్రయంలో రూ.434 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 62 కిలోల ఈ హెరాయిన్​ను ఉగాండా నుంచి దుబాయ్​ మీదుగా భారత్​కు తరలించేందుకు నిందితులు యత్నించారని అధికారులు తెలిపారు.

  • ఈ ఎనిమిది ఆసనాలతో బరువు తగ్గడం మరింత ఈజీ!

ఈ రోజుల్లో అందరూ బిజీబిజీగా గడుపుతూ ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల బరువు నియంత్రణ పెద్ద సవాల్​గా మారింది. టైంకి తినకపోవడం, పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి.

  • 'సర్కారు వారి పాట'లో 'సితార'ను బలవంతంగా ఇరికించారా? మహేశ్​ క్లారిటీ!

సూపర్​స్టార్​ మహేష్​బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12 థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.