Top news: టాప్ న్యూస్ @5PM

author img

By

Published : May 11, 2022, 4:59 PM IST

Top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!

Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు.

  • రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. బాలికపై వరుడి అత్యాచారం​

మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వరుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నిందితుడు వాయుసేన అధికారి అని పోలీసులు గుర్తించారు.

  • రష్యాకు ఉక్రెయిన్ షాక్.. గ్యాస్ సరఫరాకు బ్రేక్!

ఉక్రెయిన్‌పై సైనికచర్యకు దిగిన రష్యాకు కీవ్‌ బలగాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్న వేళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ మీదుగా పశ్చిమ యూరప్‌కు సరఫరా అయ్యేరష్యా సహజవాయువును అడ్డుకుంది.

  • సీఎం దత్తత గ్రామంలో రసాభాసగా మారిన గ్రామసభ.. ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రి పునర్నిర్మాణం ‘పంచాయితీ’కి దారితీస్తోంది. ప్రజల ఏకాభిప్రాయం కూడగట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించటం లేదు.

  • వైద్యసిబ్బందిపై మంత్రి హరీశ్​రావు ఫైర్​

Harish Rao Fire on Doctors: నార్సింగ్​ యూపీహెచ్​సీ వైద్య సిబ్బందిపై మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. ఓపీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. పని తీరు మెరుగుపర్చుకోవాలని మందలించారు.

  • మంత్రికి స్వాగతం పలికిన సమస్యలు.. 'ఉపాధి హామీ డబ్బులెప్పుడొస్తాయో చెప్పండి?'

Minister Buggana: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గనకు సమస్యలు స్వాగతం పలికాయి. 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమానికి వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకుని.. తమ మొర చెప్పుకున్నారు.

  • నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యం

Asani Cyclone Effect on AP : అసని తుపాను ప్రభావం ఆంధ్రా అన్నదాతలు తీవ్రంగా నష్టపరుస్తోంది. తుపాను కారణంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.

  • దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే

sedition cases: దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తైయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ జస్టిస్‌ ఎన్​వీ రమణ స్పష్టం చేశారు.

  • ఉబెర్​ కప్ గ్రూప్​ డీ చివరి మ్యాచ్​లో భారత్​ ఓటమి​

ఉబెర్​ కప్ గ్రూప్ డీ చివరి మ్యాచ్​లో భారత్​ ఓడిపోయింది. పీవీ సింధు సహా భారత షట్లర్లు దక్షిణ కొరియా ఆటగాళ్ల చేతిలో ఓడిపోయారు. అయితే ఇది నామమాత్రపు మ్యాచే. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి భారత జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్​ చేరింది.

  • ' 'సర్కారు వారి పాట' చూశాక ఫ్యాన్స్​ భూమ్మీద ఉండరు'

సూపర్​స్టార్​ మహేష్​బాబు, దర్శకుడు పరుశురామ్ కలయికలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా.. దర్శకుడు పరుశురామ్ ఈటీవీ భారత్​తో ముచ్చటించారు. ఈ సినిమా మహేశ్​ ఫ్యాన్స్​కు పండుగ లాంటిదని చెప్పారు పరుశురామ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.