Top news: టాప్ న్యూస్ @3PM

author img

By

Published : May 11, 2022, 2:59 PM IST

టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 'బస్తీలో సుస్తీ లేకుండా చేయడమే టార్గెట్'

Harish Rao News: ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. బస్తీలో సుస్తీ లేకుండా చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. హైదరాబాద్ నార్సింగిలో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నోస్టిక్ హబ్‌ను ప్రారంభించారు.

  • బ్యాంకు నుంచి నగదుతో క్యాషియర్‌ పరారీ..

Robbery in Bank of Baroda: బ్యాంకులో క్యాషియర్​ ఉద్యోగం. అనుకూలమైన పనివేళలతో.. ఒత్తిడి లేని బిందాస్​ జీవితం. పండుగలు, పబ్లిక్​ హాలిడేస్​, వారాంతపు సెలవులు. ఇలా అనుకుంటూ ఎంతో హుషారుగా జాబ్​లో చేరాడు ఆ ఉద్యోగి.

  • ఎంజీబీఎస్ బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం

Mgbs Boy Kidnap Case: ఎంజీబీఎస్​లో కిడ్నాప్​కు గురైన బాలుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని అపహరించిన వ్యక్తే వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యం

Asani Cyclone Effect on AP : అసని తుపాను ప్రభావం ఆంధ్రా అన్నదాతలు తీవ్రంగా నష్టపరుస్తోంది. తుపాను కారణంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.

  • నరేంద్ర మోదీ ఓ అద్భుతం: వెంకయ్య

Modi 20 book: మోదీ@20 పుస్తకం విడుదల చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీ ఓ అద్భుతమని కొనియాడారు. ఈ పుస్తకం ఆధునిక భారత్​లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరి పరిణామ క్రమాన్ని పాఠకులకు అందిస్తుందని పేర్కొన్నారు.

  • వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!

Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.

  • ఇజ్రాయెల్​ దాడిలో ప్రముఖ జర్నలిస్ట్​ మృతి

Israeli Palestinian conflict: ఆక్రమిత జెనిన్​ నగరంలో ఇజ్రాయెల్​ బలగాలు చేపట్టిన దాడుల్లో ప్రముఖ జర్నలిస్ట్​ షిరీన్​ అబు ఆక్లే ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో జర్నలిస్ట్​ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. మరోవైపు.. పాలస్తీనా వాదనలను తోసిపుచ్చింది ఇజ్రాయెల్​.

  • మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 437 కి.మీ జర్నీ

TATA Nexon EV Max: నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. అధునాతన ఫీచర్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వాహనం.. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది.

  • అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!

IPL 2022 Uncapped players: ఐపీఎల్​ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్‌లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

  • బాలీవుడ్​పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్​

Maheshbabu Bollywood comments: బాలీవుడ్​పై తాను చేసిన కామెంట్స్‌ గురించి వివరణ ఇచ్చారు సూపర్​స్టార్​ మహేశ్ బాబు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. అర్థమైందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.