Top news: టాప్ న్యూస్ @7PM

author img

By

Published : May 9, 2022, 6:52 PM IST

Top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్​

KTR Narayanapeta tour: నారాయణపేట జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పర్యటించి... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నారాయణపేట నియోజకవర్గంలో రూ.81.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు.

  • జర్మనీలోని నదిలో గల్లంతైన వరంగల్ యువకుడు

Telugu Young man washed away in Germany river: హనుమకొండ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పై చదువుల కోసం జర్మనీకి వెళ్లిన కరీమాబాద్​కు చెందిన కడారి అఖిల్.. ప్రమాదవశాత్తు అక్కడ నదిలో కొట్టుకుపోయాడు. స్పందించిన మంత్రి కేటీఆర్.. జర్మనీ అధికారులతో మాట్లాడారు.

  • ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకుని..

ఎన్నిచట్టాలు తీసుకొచ్చినా యువతులపై ప్రేమోన్మాదుల దాడులు మాత్రం ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా యువతులపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

  • ఆ విషయం... పవన్ కల్యాణ్​​నే అడగాలి : సోము వీర్రాజు

Somu on Pawan Comments: పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని భాజపా ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. తెదేపా, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో భాజపా పొత్తు పెట్టుకోదని చెప్పారు.

  • దేశద్రోహ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకు విన్నపం

Centre Decided to Re-examine Sedition Law: దేశ ద్రోహ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశద్రోహ చట్టాన్ని పున‌ఃపరిశీలించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.

  • ఇల్లు కూల్చేస్తారని ఆవేదన.. ఒంటికి నిప్పంటించుకొని వృద్ధుడు ఆత్మహత్య

Chennai Old Man Burnt Himself: తమిళనాడు చెన్నైలో ఓ వృద్ధుడు పెట్రోల్​ పోసుకొని ఆత్మహుతి చేసుకున్నారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పేరిట తన ఇల్లును కూల్చివేస్తున్నారని ఆందోళన చెందిన వృద్ధుడు.. పెట్రోల్​ పోసుకుని నిప్పటించుకున్నారు.

  • శ్రీలంక ప్రధాని రాజీనామా.. రంగంలోకి సైన్యం

Mahinda Rajapaksa resign: శ్రీలంక ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స వెనక్కితగ్గారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

  • వీళ్లంతా కేన్​ మామలా డైమండ్‌ డక్‌ కెప్టెన్లే!

క్రికెట్‌లో డకౌట్‌ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాటర్​ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్‌ అంటారు. అలాగే గోల్డన్‌ డక్‌ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరడం.

  • విజయ్​ దేవరకొండ 'లైగర్'​ వేట మామూలుగా లేదుగా..!

విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా 'లైగర్‌' నుంచి అదిరిపోయే సర్​ప్రైజ్​ అదిరిపోయింది. అలాగే దుల్కర్​ 'సీతా రామం', అక్షయ్‌ కుమార్‌ నటించిన 'పృధ్వీరాజ్' సినిమా అప్డేట్స్​ మీకోసం..

  • చావు ఎదురుపడినా భయపడని 'మేజర్'.. ఉద్విగ్నంగా ట్రైలర్!​​

అడివి శేష్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌' ట్రైలర్​ వచ్చేసింది. తెలుగులో ప్రచార చిత్రాన్ని మహేశ్‌బాబు విడుదల చేశారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన 'ధగడ్ సాంబ' ట్రైలర్​ అప్డేట్​ మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.