Top news: టాప్ న్యూస్ @5PM

author img

By

Published : May 9, 2022, 4:59 PM IST

Top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

Mahinda Rajapaksa resign: శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • 'సర్కారు కొలువు కొట్టాలంటే.. వాటికి దూరంగా ఉండాలి'

KTR suggestions to job Aspirants: ఉద్యాగార్థులకు రాబోయే ఆరు నెలలు కీలకమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఈ ఆరు నెలలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు.

  • 'నెల రోజుల్లోనే కేసీఆర్​ న్యూట్రిషియన్​ కిట్ పథకాన్ని ప్రారంభిస్తాం'

Harish Rao Comments: తెరాస హయాంలో సర్కారు దవాఖానాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను 70శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.

  • రాకింగ్ స్టార్​పై యువతి అభిమానం.. ఏడు కేజీల కేక్​లో 'యష్' రూపం

Cake in the form of Yash: కేజీఎఫ్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ సీక్వెల్​తో ఆ అభిమానాన్ని మరింత పెంచేసుకున్నాడు ఈ కన్నడ స్టార్.

  • 'మంత్రి సురేశ్​ నా పొలాన్ని ఆక్రమించారు'.. స్పందనలో మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకుంది.

  • షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు.. సుప్రీంలో వారికి చుక్కెదురు!

Shaheen Bagh protests: అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు దర్శనమిచ్చాయి. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు.

  • 'మాతృభూమి కోసమే ఈ యుద్ధం'.. 'విక్టరీ డే' ప్రసంగంలో పుతిన్

Putin victory day speech 2022: ఉక్రెయిన్​లో చేపడుతున్న ప్రత్యేక సైనిక చర్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల విధానాలు, వారి దురాక్రమణను అడ్డగించేందుకే ఈ సైనిక చర్య ప్రారంభించినట్లు చెప్పారు.

  • నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి

సెన్సెక్స్​ 365 పాయింట్లు డౌన్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.

  • వీళ్లంతా కేన్​ మామలా డైమండ్‌ డక్‌ కెప్టెన్లే!

క్రికెట్‌లో డకౌట్‌ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాటర్​ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్‌ అంటారు. అలాగే గోల్డన్‌ డక్‌ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరడం.

  • ఆ 45 నిమిషాలు థియేటర్​ ఊగిపోతుంది: మహేశ్​బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం దర్శకత్వం వహించిన చిత్రం 'సర్కారు వారి పాట'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.