Top news: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : Jan 28, 2022, 9:01 PM IST

TOP NEWS IN TELANGANA

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

  • డ్రగ్స్​ నిర్మూలనకు ద్విముఖవ్యూహం..

KCR review on drug use control: వినూత్నరీతిలో ఆలోచించి బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు.

  • ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం..

Harish Rao Khammam Tour: త్వరలోనే ఆదిలాబాద్​లో క్యాథ్ ల్యాబ్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్​లోని ఆస్పత్రులకు పరిమితమైన గుండె సంబంధిత వైద్యసేవల్ని.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని హరీశ్ రావు వెల్లడించారు.

  • రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి..

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 97,579 మందికి కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 3,877 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది.

  • కేరళలో కరోనా విజృంభణ..

State Wise Covid Cases: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 54 వేల మందిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్​ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిల్లీ కొత్తగా నాలుగు వేలకుపైగా కేసులు వెలుగు చూడగా.. పాజిటివిటీ రేటు తగ్గింది. మహారాష్ట్రలోని ధారావిలో కొవిడ్​ కేసులు సున్నాగా నమోదయ్యాయి.

  • దక్షిణాది రాష్ట్రాలకు కీలక సూచనలు..

Covid Situation in Southern States: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, టీకా పంపిణీలో పురోగతి, వైరస్​పై పోరుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ. కొవిడ్​ నిర్వహణకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రశంసించారు.

  • మోదీ ఇమేజ్​ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?

uttarakhand polls 2022 : ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా- ప్రతిపక్ష కాంగ్రెస్​ నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నాయి. రాష్ట్రంలో ద్విముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ముఖ్యమంత్రుల మార్పు ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది?

  • 61 ఏళ్ల వయసులో 'నీట్​' పాస్​..

Retired teacher pass in NEET: 61 ఏళ్ల వయస్సులో నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్​ సీటు సాధించారు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు. అయితే.. చివరి నిమిషంలో తన ఎంబీబీఎస్​ సీటును వదులుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.

  • పబ్​జీకి బానిసై కుటుంబాన్ని కాల్చేశాడు..

Minor Shot Family: పబ్​జీ గేమ్​కు బానిసైన ఓ బాలుడు తన కుటుంబాన్ని హతమార్చాడు. తల్లి, తోబుట్టువులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చిచంపాడు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.

  • నాలుగోసారి ఛాంపియన్​గా పెర్త్ స్కార్చర్స్..

BBL finals: బిగ్​బాష్​ లీగ్​ ఫైనల్స్​లో ఘన విజయం సాధించింది పెర్త్​ స్కార్చర్స్​. సిడ్నీ సిక్సర్స్​ను 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. నాలుగోసారి టైటిల్​ కైవసం చేసుకుంది.

  • కొత్త సినిమాల ముచ్చట్లు..

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో శ్రుతి హాసన్ వెబ్​సిరీస్​, 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'డీజే టిల్లు' సినిమాల విశేషాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.