Telangana News Today: టాప్​న్యూస్​ @ 3PM

author img

By

Published : Oct 3, 2022, 2:58 PM IST

3P TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • దసరా రోజు యధావిధిగా పార్టీ నేతల భేటీ: కేసీఆర్‌

అక్టోబర్‌ 5 న యధావిధిగా తెరాస సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దసరా రోజు యధావిధిగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతల భేటీ ఉంటుందని పేర్కొన్నారు.

  • మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా..

మునుగోడు ఉపఎన్నికల నగారా మోగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

  • 'కేసీఆర్​కు ఉన్న ఏకైక మిత్రపక్షం మజ్లిస్​.. 8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు'

మజ్లిస్ బలోపేతం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. తెరాసకు మిగిలిన ఏకైక మిత్రపక్షం మజ్లిస్ మాత్రమేనని పేర్కొన్నారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని ఆరోపించారు.

  • ట్రాఫిక్​ కొత్త రూల్స్​.. గీతదాటారో ఇక అంతే..

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు కళ్లెం వేసేలా పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ రోప్‌ అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంతో ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. వాహనాల రద్దీని తగ్గించి, నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

  • ఖర్గే విజన్ ఖర్గేకు ఉంది.. నా విజన్​​​ నాకు ఉంది: శశిథరూర్​

స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిపించేందుకు గాంధీ కుటుంబం కట్టుబడి ఉందని కాంగ్రెస్​ పార్టీ నాయకుడు శశిథరూర్​ అన్నారు. హైదరాబాద్​లోని తాజ్​ కృష్ట హోటల్​లో సమావేశం నిర్వహించిన ఆయన.. భాజపాను ఎలా ఎదుర్కోవాలని అనేదే మా కాంగ్రెస్​ ఫ్యామిలీ అంతర్గత చర్చ అని వ్యాఖ్యానించారు.

  • 29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలతో కలిసి భోజనం చేశారు రాహుల్ గాంధీ. ఇదే భారత్​ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.

  • దుర్గా మండపంలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి

దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తర్​ప్రదేశ్​ భదోహిలో దుర్గమ్మ మండపంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు.

  • క్లీన్​స్వీప్​​పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ప్లేయర్స్​కు విశ్రాంతి

ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీన్​ చేయాలని భావిస్తోంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ కోసం జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది.

  • నడిచేందుకు ప్రభాస్ ఇబ్బందులు​.. ఈవెంట్​లో ఏమైంది?

ఆదిపురుష్​ టీజర్ రిలీజ్​ ఈవెంట్​లో ప్రభాస్​ సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయనకి ఏమైందంటే?

  • త్రివిక్రమ్​ను తిట్టింది నేనే: ఆడియో లీక్​పై బండ్ల గణేశ్ క్లారిటీ

భీమ్లానాయక్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ సమయంలో నిర్మాత బండ్ల గణేశ్​కు సంబంధించిన ఓ ఆడియో టేప్​ వైరల్​ అయింది. అందులో ఆయన దర్శకుడు త్రివిక్రమ్​ను తిడుటున్నట్లుగా ఉంది. అయితే తాజాగా దీనిపై స్పందించిన ఆయన ఆ వాయిస్​ తనదేనని ఒప్పుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.