Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM

author img

By

Published : May 12, 2022, 12:58 PM IST

TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ..

నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. నేటి నుంచి 5 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించింది. కాసేపట్లో నిందితులను సరూర్‌నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీలో నిందితులు మోబిన్‌, అహ్మద్‌ను పోలీసులు విచారించనున్నారు.

  • రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఈసీ ఉపఎన్నిక నిర్వహించనుంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉండగా.. మే 30వ తేదీన పోలింగ్ జరగనుంది. 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించగా.. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనుంది.

  • 'కాల్‌ అవే టీమ్‌'.. మీ ఛాయిస్ సూపర్

మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్‌ దేశంలోని నగరాలన్నింటి కంటే ముందుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాయదుర్గం రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్‌లో కాల్‌ అవే గోల్ఫ్‌ సంస్థ డిజిటెక్ సెంటర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవిష్యత్‌లో ఈ కంపెనీ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.

  • రూ.100 అదనంగా కడితే.. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా

కస్టమర్లను ఆకర్షించే క్రేజీ ఆఫర్లు.. యూత్‌ ఇష్టపడేలా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు.. పల్లెపల్లెన నెట్‌వర్క్‌ టవర్లు.. తరచూ కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లతో టెలికామ్ రంగంలో ఎల్లప్పుడూ నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న జియో మరో క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ ఎంటర్‌టైన్మెంట్ బొనాంజా పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో రూ.100 అదనంగా చెల్లించి 14 ఓటీటీల నుంచి అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్మెంట్ పొందొచ్చు.

  • వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్​..

భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మను దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్​కు చెందిన మహిళ హనీ ట్రాప్​లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు శర్మపై ఆరోపణలు ఉన్నాయి. పాక్ మహిళ.. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్ర శర్మను ట్రాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు.

  • లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

60 అడుగుల లోయలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. వివాహానికి హాజరై వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

  • రోడ్డు దాటుతూ బైకర్​పై నుంచి జింక హైజంప్​..

రోడ్డుపై రయ్​ మంటూ దూసుకెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి అనూహ్య సంఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్​, బాలాఘాట్​లోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ బైకర్​పై నుంచి జంప్​ చేసింది ఓ జింక. పై నుంచి దూకుతూ ఒక్క కిక్​ ఇవ్వడం వల్ల వాహనదారుడు కింద పడిపోయాడు. అయితే, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

  • పెరిగిన బంగారం, వెండి ధర..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.480కిపైగా వృద్ధి చెందింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి సైతం రూ.105 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.62,260గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,840గా ఉంది.

  • 100 మీటర్ల హర్డిల్స్​లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి.. సైప్రస్‌ అంతర్జాతీయ మీట్‌లో స్వర్ణ పతకం సాధించింది. 100 మీ హర్డిల్స్‌ను 13.23 సెకన్లలో పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచింది. 2002లో అనురాధ బిశ్వాల్‌ (13.38 సె) నమోదు చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.

  • వారి వల్లే నా పెళ్లి కావడం లేదు..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాహ వార్త కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎవరితో ఏడు అడుగులు వేయనున్నారు? అనే అంశంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలో తన పెళ్లిపై కంగన స్పందించారు. కొంతమంది వ్యాప్తి చేస్తోన్న పుకార్ల వల్లే తనకు పెళ్లి కావడం లేదని కంగన అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.