Telangana News Today : టాప్‌న్యూస్ @ 7AM

author img

By

Published : May 11, 2022, 6:59 AM IST

Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌

నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్‌ సులోచనారాణి బెయిల్‌ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

  • అడ్మిషన్ల కోసమే మాల్ ప్రాక్టీస్‌

పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లు ఏపీలోని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను అదుపులోకి తీసుకున్నామన్నారు. గత నెల 27న పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం వాట్సాప్‌ గ్రూపులో సర్క్యులేట్‌ అయిందని డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

  • అసని తుపాను ఎఫెక్ట్.. భారీగా రైళ్లు రద్దు

అసని తుపాను ప్రభావంతో 37 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్ చేశామని తెలిపింది. మార్పులకు అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ వెల్లడించింది.

  • అప్పులకు అనుమతి ఇవ్వని కేంద్రం.. ఏం చేయాలన్నదానిపై మథనం

అప్పులకు అనుమతి లభించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆ ప్రభావం ఆర్థిక ప్రణాళికపై పడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడనుంది. ఓ వైపు కేంద్రం నుంచి అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న సర్కార్... ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించింది. అటు కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

  • ఆ ప్రాంతాల్లో సాయుధ దళాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేస్తాం

అసోంలో త్వరలోనే సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం(AFSPA) పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తెలిపారు​. తీవ్రవాదం, హింస నుంచి అసోంకు పూర్తిగా విముక్తి లభించే రోజు ఎంతో దూరం లేదని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

  • ఎక్కడ చదివితే.. అక్కడే ఇంటర్న్‌షిప్‌

ప్రైవేట్ వైద్య విద్యార్థులు ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్న్​షిప్ చేయడం కుదరదు. ఎందుకంటే ఎక్కడ చదివితే అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేయాలని ఎన్​ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్య విద్యార్థులు ఇతర కళాశాలల్లో చేరకూడదని తెలిపింది. ఈ వ్యవహారానికి తాజాగా జాతీయ వైద్యకమిషన్‌(ఎన్‌ఎంసీ) అడ్టుకట్ట వేసింది.

  • రాణి లేకుండా బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు.. దానికి సంకేతమా?

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 మంగళవారం.. పార్లమెంటు సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాబోరని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఆమె 70 ఏళ్ళ పాలనా కాలంలో గర్భిణిగా ఉన్న 1959, 1963 సంవత్సరాల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ తర్వాత హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. అయితే ఇది అధికార మార్పిడి దిశగా పడుతున్న అడుగులకు సంకేతమని భావిస్తున్నారు.

  • ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్​బీఐ గుడ్ న్యూస్

స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్లు, అంతకుమించిన టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు మంగళవారం ఎస్‌బీఐ ప్రకటించింది.

  • గుజరాత్​ ఘన విజయం

లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది.

  • అలా చెప్పడానికి ఏమాత్రం వెనకాడను: మహేశ్​బాబు

'సర్కారు వారి పాట' చేస్తున్నప్పుడు 'పోకిరి' రోజులు ఎందుకు గుర్తుకొచ్చాయో చెప్పారు హీరో మహేశ్​బాబు. ఈ మూవీ ప్రయాణం ఎలా సాగింది? కరోనా సమయంలో కథలో మార్పులు, చేర్పులేమైనా చేశారా? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులివీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.