Telangana News Today : టాప్‌న్యూస్ @ 11AM

author img

By

Published : May 10, 2022, 11:00 AM IST

Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • భారత్​లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

భారత్​లో కొవిడ్​ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2288 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. 12-14 ఏళ్ల వయసుగల 3 కోట్లమందికిపైగా యువత టీకా తొలి డోసు పొందినట్లు కేంద్రం తెలిపింది.

  • బెడ్​షీట్​పై 'పీరియడ్స్'​ మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్​ షాక్!

మహిళల్లో పీరియడ్స్​ అనేది సాధారణ ప్రక్రియ. దీనిపై సమాజంలో అందరికీ అవగాహన కలిగించేందుకు కేంద్రం, ఎన్​జీఓలు కృషి చేస్తుంటే.. మరోవైపు బంగాల్​ మెదినీపుర్​లో ఓ షాకింగ్​ ఘటన వెలుగుచూసింది. బెడ్​షీట్​పై 'రుతుస్రావం' రక్తపు మరకలు ఉన్నాయని హోటల్​ యాజమాన్యం.. ఓ మహిళా ప్రొఫెసర్​ నుంచి అదనంగా డబ్బులు వసూలుచేసింది. దీనిపై దుమారం రేగుతోంది.

  • ఆర్టీసీలో వింత పరిస్థితి

టీఎస్‌ఆర్టీసీలో వింత పరిస్థితి నెలకొంది. ఎక్కువ కలెక్షన్‌(ఆదాయం) తీసుకురాకపోతే కండక్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా అని ప్రతి దగ్గర ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటే.. డ్రైవర్‌ కండక్టర్‌పై కస్సుమంటున్నాడు. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆపుతూ పోతే డీజిల్‌ వ్యయం ఎక్కువవుతోందని.. దీంతో తాను డిపోలో చీవాట్లు తినాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

  • ' నేను కూడా అమ్మానాన్నల దగ్గరికి వెళ్తా'

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

  • తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్'

పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారమైన 'పులిట్జర్'.. ఈ ఏడాది నలుగురు భారతీయుల్ని వరించింది. గతేడాది తాలిబన్లకు, అఫ్గాన్ భద్రతా బలగాలకు మధ్య పోరును చిత్రీకరించేందుకు వెళ్లి, ప్రాణాలు కోల్పోయిన ఫొటో జర్నలిస్ట్​ డానిష్ సిద్ధిఖీ వీరిలో ఒకరు. సిద్ధిఖీని పులిట్జర్ వరించడం ఇది రెండోసారి.

  • చేయూత నివ్వాల్సింది పోయి.. చేతివాటం చూపెట్టారు..

రెండు కాళ్లూ చచ్చుబడిపోయి.. అచేతనంగా మారిపోయిన వ్యక్తికి సర్కార్ కొంత భూమిని కేటాయించింది. ఆయనకు చెందిన భూమిని అక్రమార్కులు గుట్టుగా అమ్మేసుకున్నారు. తనకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లి చూస్తే అక్కడ ఇళ్లు నిర్మించి ఉంది. కంగుతిన్న ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

  • వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా..

తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని.. ఇవాళ తుపానుగా బలహీనపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నేడు వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముందని వెల్లడించింది. తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించవచ్చునని అంచనా వేస్తున్నారు.

  • తగ్గిన బంగారం ధర

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  • ఈ ఐపీఎల్‌ సీజన్​లో అద్భుత ప్రదర్శనలివే..

ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలకు ఎప్పుడో తెరపడింది. గత రాత్రి కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లోనూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత అభిమానులను అమితానందానికి గురి చేసిన విషయం.. బుమ్రా పూర్వపు ఫామ్‌ను అందుకోవడమే. టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ సీజన్​లో అద్భుత బౌలింగ్​ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం..

  • బాలీవుడ్​ నన్ను భరించలేదు

బాలీవుడ్​ ఎంట్రీ విషయంపై మరోసారి స్పష్టతనిచ్చారు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. బాలీవుడ్ తనను భరించలేదని, హిందీ సినిమాల్లో నటించి సమయం వృథా చేయాలనుకోవట్లేదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.