Telangana News Today : టాప్‌న్యూస్ @ 7AM

author img

By

Published : May 10, 2022, 7:00 AM IST

Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • బొలెరో వాహనంలో మంటలు.. ఒకరు సజీవదహనం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద బొలెరో వాహనంలో మంటలు చెలరేగి ఒకరు సజీవదహనమయ్యారు. టైర్లు తరలిస్తున్న వాహనం నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

  • అప్పుల రాష్ట్రంగా పరిగణించడం కక్షపూరిత చర్య

అప్పులు తీసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. బడ్జెట్ వెలుపలి అప్పులను అకస్మాత్తుగా రాష్ట్రాల అప్పులుగా పరిగణించడం అత్యంత కక్షపూరిత చర్య అన్న ప్రభుత్వం నిబంధనల పేరిట అప్పుల కోసం బంధనాలు వేయడాన్ని తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగా భావించాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

  • పంచాయతీలకు ఆరు నెలలుగా మంజూరు కాని బిల్లులు

పంచాయతీలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. గత ఆరు నెలలుగా ఆర్థికశాఖలో బిల్లులు పెండింగ్​లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల సర్పంచులు సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ బిల్లులు రాక ఆందోళనకు గురవుతున్నారు. మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకూ వేతనాలు ఇవ్వకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

  • పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో బాంబు పేలుడు.. వారి పనేనా?

పంజాబ్​లో మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్​ కార్యాలయంలో సోమవారం అనుమానాస్పద పేలుడు సంభవించింది. హెడ్​ క్వార్టర్స్​లోని ఓ భవనం లక్ష్యంగా గ్రెనేడ్​ విసిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

  • 21 సంవత్సరాలుగా భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. ఆపై భయం వేసి..

ఓ వ్యక్తి.. తన భార్య మృతదేహాన్ని 21 సంవత్సరాలుగా ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత భయం వేసి తనకు తెలిసిన ఛారిటబుల్​ ట్రస్ట్​ వారి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో వాళ్లు శవపేటికలో ఉన్న అతడి భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

  • శ్రీలంకలో హింస.. రాజపక్స ఇంటికి నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహీంద రాజపక్స వెనక్కితగ్గి.. తన పదవికి రాజీనామా చేశారు. నిరసన కారులు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై విధ్వంసానికి దిగారు. హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల ఇంటిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తగలబెట్టి విధ్వంసం సృష్టించారు.

  • 'విక్టరీ డే' వేళ.. రష్యా రాయబారిపై ఎర్ర సిరాతో దాడి

పొలండ్‌లోని రష్యా రాయబారికి నిరసన సెగ ఎదురైంది. రష్యా జరుపుకొంటున్న 'విక్టరీ డే' ఉత్సవాల్లో భాగంగా పొలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లగా ఉక్రెయిన్​ మద్దతుదారులు ఆయనను చుట్టుముట్టారు. అంతేకాకుండా వారి చేతుల్లో ఎర్ర సిరాను ఆయన ముఖంపై చల్లి.. నియంత, హంతకుడంటూ నినాదాలు చేశారు.

  • నూతన వాహన కొనుగోలుదారులకు షాక్

నూతన వాహన కొనుగోలుదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత మోగించనుంది. లైఫ్ ట్యాక్స్‌ను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కారు తీసుకువచ్చిన నూతన విధానం వెంటనే అమలులోకి వస్తోందని వెల్లడించింది. బైకులు, కార్లు సహా ఇతర ఏ వాహనాలు కొన్నా... వారిపై ఈ కొత్త భారం పడనుంది.

  • జీవితకాల కనిష్ఠానికి రూపాయి విలువ

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 77.44 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల కారణంగా ఇప్పటికే వస్తువుల ధరలు భగ్గుమంటుంటే.. రూపాయి మారకపు విలువ క్షీణత వల్ల రోజువారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సామాన్యులకు కూరగాయలు, నెలవారీ ఖర్చులు కూడా మరింత భారమవ్వనున్నాయి.

  • 'దానికోసం ఏకధాటిగా 72 గంటలు పనిచేసేవాడిని!'

నరేష్‌ ఇంటి పేరు ఈదర నుంచి అల్లరిగా మారి ఇరవయ్యేళ్లయింది. 'అల్లరి'తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన.. తర్వాత వెనుదిరిగి చూడలేదు. హాస్యానికి చిరునామాగా మారిపోయి, ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకెళ్లారు. కితకితలు పెట్టడమే కాదు... తన నటనలో మరో కోణం కూడా ఉందని 'గమ్యం', 'శంభో శివ శంభో', 'మహర్షి', 'నాంది' తదితర చిత్రాలతో నిరూపించారు. ఆయన తొలి చిత్రం 'అల్లరి' ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంతో 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా కెరీర్​ గురించి పలు విషయాలు తెలిపారు. ఆ విశేషాలివీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.