పోలీసు ఇంటికే.. కన్నం వేసిన దొంగలు..!

పోలీసు ఇంటికే.. కన్నం వేసిన దొంగలు..!
Theft in head Constable house: చోరీలను అరికట్టే పోలీసు ఇంట్లోనే దొంగతనం జరిగింది. దీంతో.. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసే.. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయాల్సిన వింత సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
Theft in head Constable house: ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండలోని హెడ్‌కానిస్టేబుల్ బాలు ఇంట్లో గురువారం సాయంత్రం చోరి జరిగింది. ప్రస్తుతం ఆయన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయురాలైన భార్య విజయలక్ష్మి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి డిపార్టుమెంటల్ పరీక్ష రాయడానికి బుధవారం తాడిపత్రికి వెళ్లి.. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు.
తీరా ఇంట్లోకి వెళ్లి చూస్తే.. చోరీ జరిగినట్లు అర్థమైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తాళం వేసిన ఇంట్లోకి చాకచక్యంగా చొరబడిన దొంగలు.. రెండు బీరువాల్లోని 4 తులాల బంగారం. కేజీ వెండి ఆభరణాలతో పాటు రూ.50వేలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు చోరి జరిగిన ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
