KTR About Callaway Golf : ''కాల్ అవే టీమ్'.. మీ ఛాయిస్ సూపర్'

KTR About Callaway Golf : ''కాల్ అవే టీమ్'.. మీ ఛాయిస్ సూపర్'
KTR About Callaway Golf Company : మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ దేశంలోని నగరాలన్నింటి కంటే ముందుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాయదుర్గం రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్‌లో కాల్ అవే గోల్ఫ్ సంస్థ డిజిటెక్ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవిష్యత్‌లో ఈ కంపెనీ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.
KTR About Callaway Golf Company : పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించడంలో.. హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ నగరమని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్‌లో కాల్ అవే గోల్ఫ్ సంస్థ డిజిటెక్ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.150 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించింది.
గుడ్ ఛాయిస్.. కాల్ అవే డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు సరైన నగరాన్ని ఎంచుకుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి కంపెనీలు ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. టాప్‌గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
Callaway Golf Company in Hyderabad : "హైదరాబాద్‌లో కాల్అ వే సంస్థ కార్యాలయం ఏర్పాటు సంతోషం. తెలంగాణాలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయి. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఆమెజాన్ అతిపెద్ద సెంటర్ హైదరబాద్‌లో ఉంది. మౌలిక వసతుల్లో హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కంటే ముందుంది. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కాల్అ వే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాం."
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
అందుకే హైదరాబాద్ వచ్చాం.. అమెరికా తర్వాత చాలా చర్చల అనంతరం ఇండియాలో కార్యాలయం పెట్టాలనుకున్నామని కాల్ అవే సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కూరపాటి తెలిపారు. హైదరాబాద్‌లో మంచి సౌకర్యాలున్నాయని తెలుసుకుని ఇక్కడే ఈ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇక్కడి సదుపాయాలు చూసిన తర్వాత భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే సూచన కనిపిస్తోందని అన్నారు.
