koona ravi kumar arrest : అర్ధరాత్రి సమయంలో.. తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు

author img

By

Published : Nov 21, 2021, 6:42 AM IST

koona ravi kumar arrest

ఏపీలోని శ్రీకాకుళంలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్​ను అర్ధరాత్రి వేళ పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారంటూ అదుపులోకి తీసుకున్నారు.

తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్టు (TDP leader Koona Ravikumar arrested) చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారని శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని శాంతినగర్ కాలనీలోని ఆయన అన్నయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

పోలీసుల తీరును కూన రవికుమార్ అన్నయ్య కూన వెంకట సత్యనారాయణ ఖండించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి (TDP leader Koona Ravikumar arrested) గది తలుపులు బద్ధలుకొట్టి... తన తమ్ముడి తీసుకెళ్లారని ఆరోపించారు.

ఇదీ చూడండి : CM KCR Delhi Tour: నేడు హస్తినకు సీఎం కేసీఆర్​.. అన్ని విషయాలు తేల్చుకునేందుకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.