Rajinikanth Phone call to Chandrababu : చంద్రబాబుకు నటుడు రజనీకాంత్​ ఫోన్​

author img

By

Published : Nov 21, 2021, 9:19 AM IST

Updated : Nov 21, 2021, 10:06 AM IST

rajani kanth calls to chandra babu

09:16 November 21

Rajinikanth Phone call to Chandrababu : చంద్రబాబుకు నటుడు రజనీకాంత్​ ఫోన్​

  • I know NTR family from 1984 when Mrs NTR-Basavaramatarakam was treated at cancer Institute, Adyar. I was pained to hear that personal abuses were hurled at Smt. Bhuvaneswari w/o @ncbn in AP assembly. It is condemnable. I spoke to Chandrababu Naidu today.@ncbn @PurandeswariBJP pic.twitter.com/obY42rTz4K

    — DR V MAITREYAN (@maitreyan1955) November 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్(Rajinikanth Phone call to Chandrababu)​ పరామర్శించారు. శుక్రవారం (నవంబర్​ 19) ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్​.. చంద్రబాబుకు ఫోన్​ చేసి మాట్లాడారు.

అన్నాడీఎంకే సీనియర్​ నేత ఫోన్​..

అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. ఈ మేరకు మైత్రేయన్​ ట్వీట్​ చేశారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో తనకు పరిచయాలున్నట్లు మైత్రేయన్‌ చెప్పారు. ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.  

చంద్రబాబు కన్నీటిపర్యంతం

ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి(Chandrababu crying news) గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తీవ్రంగా అవమానించారంటూ... మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకునే ప్రయత్నం చేసినా.... అవమానభారంతో ఆయనకు ఉద్వేగం ఆగలేదు. అధినేత కన్నీళ్లు పెట్టడం  చూసిన తెలుగుదేశం నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎలాంటి పరిస్థితులనైనా మొక్కవోని ధైర్యంతో దీటుగా ఎదుర్కొనే చంద్రబాబు.... ఒక్కసారిగా ఏడవడంతో వాళ్లూ కంటతడి పెట్టారు.

నందమూరి కుటుంబసభ్యుల స్పందన

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ(Balakrishna chandrababu naidu).. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధికి బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. ఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.  

ఎన్టీఆర్ స్పందన

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్(ntr about chandrababu incident) స్పందించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు.  

            'నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలిచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు.  ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలి'

                                      -  జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ నటుడు

ఇవీ చదవండి:

Last Updated :Nov 21, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.