Trains cancel: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు

author img

By

Published : Nov 19, 2021, 10:58 PM IST

trains news

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల (rains in ap) కారణంగా దక్షిణ మధ్య రైల్వే (south central railway) పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది.

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల (rains in ap) కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (south central railway) రద్దు చేసింది. తడ-సుళ్లూరుపేట మార్గంలో.. ప్రవహిస్తోన్న వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరటంతో.. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లింపును పాక్షికంగా రద్దు చేశారు. ఇవాళ్టి తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - చెన్నై రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సెంట్రల్- ముంబయి సీఎస్​ఎంటీ, గుంతకల్- రేణిగుంట రైళ్లు రద్దుచేశారు. బిట్రగుంట- చెన్నై సెంట్రల్, చెన్నైసెంట్రల్- బిట్రగుంట, విజయవాడ - చెన్నైసెంట్రల్, చెన్నైసెంట్రల్ - విజయవాడ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నందలూరు - రాజంపేట మధ్య రైలు పట్టాలపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న కారణంగా.. ఆ మార్గంలోనూ వెళ్లే పలు రైళ్లు రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, రైళ్లు రద్దయ్యాయి. ఎల్​టీటీ ముంబయి- చెన్నై సెంట్రల్, సీఎస్​ఎంటీ ముంబయి- నాగర్​సోల్​, మధురై-ఎల్​టీటీ ముంబయి రైళ్లు రద్దు చేశారు. చెంగల్పట్టు- కాచిగూడ, చెన్నై సెంట్రల్- ఎల్​టీటీ ముంబయి రైళ్లు రద్దు చేశారు. తడ- సుళ్లూరుపేట మధ్య నడిచే 4 రైళ్లు, నందలూరు- రాజంపేట మధ్య నడిచే 12 రైళ్లు దారి మళ్లించి నడుపుతున్నారు.

ఇదీచూడండి: Tirumala pedestrian path damaged: తిరుమలలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన శ్రీవారి మెట్టు మార్గం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.