పాఠశాల ప్రాంగణంలో శివలింగం కలకలం..

author img

By

Published : Sep 10, 2022, 6:57 PM IST

lord shiva

పాఠశాల ప్రాంగణంలో మూడు వైపుల శివలింగం రూపం, ఒకవైపు పాము పడగతో ఉన్న ప్రతిమ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అక్కడకు చేరుకున్న స్థానికులు శివలింగానికి పూజలు నిర్వహించారు. ఈ సంఘటన భద్రాది కొత్తగూడెం జరిగింది.

మూడువైపులా శివుని రూపం, నాగుపాము పడగతో ఉన్న లోహపు శివలింగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దొరకడం కలకలం రేపింది. మూడువైపులా శివుని ఆకారం నాగుపాము మరో ఆకారం కూడా ఉండడంతో పంచముఖ శివుని రూపం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని విద్యార్థులు గుర్తించారు.

కాగా విగ్రహం లభించిన ప్రాంతంలో ఉన్న గద్దె వంటి నిర్మాణంపై గతంలో శ్రీరామనవమి, వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. విగ్రహం లభించిన ప్రాంతం పాఠశాల పరిధిలో ఉండడంతో ఇటీవల చుట్టూ కంచె ఏర్పాటు చేసి బడి యాజమాన్యం మొక్కలను పెంచడం ప్రారంభించారన్నారు.

విగ్రహం లభించిన విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలన చేశారు. పంచముఖ శివలింగానికి గ్రామస్థులు పూజలు నిర్వహించారు. వినాయక చవితి, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్న స్థలాన్ని పూర్వకాలంలోనే బడి, గుడి నిర్మాణం కోసం స్థల దాత విరాళంగా ఇచ్చారని స్థానికులు చెప్పారు. వారు ఇచ్చిన స్థలంలో బడి నిర్మాణం జరిగింది కానీ గుడి నిర్మాణం జరగలేదని వారు వాపోయారు. దేవుని మహిమతో విగ్రహం బయటపడిందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకులు, గ్రామ పెద్దలు గుడి విషయంలో స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.