Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,944 కరోనా కేసులు

author img

By

Published : Jan 27, 2022, 7:35 PM IST

Updated : Jan 27, 2022, 7:56 PM IST

new corona cases in telangana today

19:27 January 27

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,944 కరోనా కేసులు

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 97,579 మందికి కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా..3,944 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే 1,372 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్​ మరణాల సంఖ్య 4,081కి చేరింది. రాష్ట్రంలో 94.20 శాతం రికవరీ రేటు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

వైరస్​ నుంచి మరో 2,444 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39,520 క్రియాశీల కేసులున్నాయి. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అలసత్వం వహించొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,03,71,500
  • మొత్తం మరణాలు: 4,91,700
  • యాక్టివ్ కేసులు: 22,02,472
  • మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328

ఇదీ చూడండి:

Last Updated :Jan 27, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.