ప్లీనరీలో మంత్రి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి.. ఎందుకొచ్చాడంటే?

ప్లీనరీలో మంత్రి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి.. ఎందుకొచ్చాడంటే?
Munnuru Ravi at TRS Plenary : తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్ని కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి మరోసారి వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా బుధవారం జరిగిన తెరాస 21వ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యాడు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన అతడు.. ప్లీనరీలో పాల్గొనడం కలకలం రేపుతోంది. ఇంకా మంత్రి హత్యకు కుట్ర పన్నుతున్నాడా అన్న అనుమానం రేకెత్తుతోంది. దీనిపై మున్నూరు రవి ఏం వివరణ ఇచ్చాడంటే..
Munnuru Ravi at TRS Plenary : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఆరోపణలుగా ఎదుర్కొంటున్న మున్నూరు రవి బుధవారం తెరాస నిర్వహించిన ప్లీనరీకి హాజరయ్యాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీలో పాల్గొనడం కలకలం రేపుతోంది. దీనిపై మున్నూరు రవిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ వివరణ కోరగా తాను ఉద్యమ సమయం నుంచి తెరాసలో క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నానని, పార్టీకి వీరాభిమానిని అని చెప్పాడు.
తెరాస ప్లీనరీకి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గైర్హాజరయ్యారు. దీనిపై జూపల్లిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ సంప్రదించగా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలు, ఉద్యమకారులపై కేసులు, పోలీసుల తీరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికే తాను హాజరు కాలేదని వెల్లడించారు. తాను మాత్రం తెరాసలోనే కొనసాగుతున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి :
