వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది: జస్టిస్‌ ఎన్వీ రమణ

author img

By

Published : Sep 24, 2022, 8:49 PM IST

Justice NV Ramana

Justice NV Ramana attended ISB Leadership Summit: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదని... సమాజంలో అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. వ్యాపారం చేసేవారు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Justice NV Ramana attended ISB Leadership Summit: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదని.. సమాజంలో నెలకొన్న అసమానతలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వ్యాపారం చేసేవారు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ.. 20 ఏళ్లలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు.

వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది: జస్టిస్‌ రమణ

'వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యత కాదు. సమాజంలో అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 1999లో అంతర్జాతీయ బిజినెస్ ఇన్స్ స్టిట్యూట్ ఏర్పాటు అయ్యింది. ఐఎస్‌బీతో ప్రారంభరోజుల్లో నాకు అనుబంధం ఉంది. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఐఎస్‌బీ అభివృద్ధికి సహకరించారు.'-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, విశ్రాంత సీజేఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.