'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్​కు హరీశ్​ సవాల్​..

author img

By

Published : Sep 2, 2022, 3:34 PM IST

If Nirmala Sitharaman proves that I will resign challenged Harish Rao

Harish Rao Comments: రేషన్​ షాప్​లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని కలెక్టర్​పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ఆగ్రహం వ్యక్తం చేయటంపై మంత్రి హరీశ్​రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు నిర్మల్‌ సీతారామామన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఆమె అన్న మాటలు నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు.

'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్​కు హరీశ్​ సవాల్​..

Harish Rao Comments: పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడే పార్టీ భాజపా అని మంత్రి హరీశ్​రావు ధ్వజమెత్తారు. మెదక్​ జిల్లా తూప్రాన్​లో కేంద్ర ప్రభుత్వంపై హరీశ్​రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​.. ప్రధాని మోదీ ఫొటోను రేషన్‌ దుకాణంలో పెట్టాలనడం హాస్యాస్పదమన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్‌ అసత్యాలు చెబుతున్నారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్​రావు సవాల్​ విసిరారు. రాష్ట్ర ప్రజలకు నిర్మల్‌ సీతారామామన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

"కేంద్ర ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడే పార్టీ భాజపా. కేంద్ర ఆర్థికమంత్రి ప్రధాని ఫొటో రేషన్‌ దుకాణంలో పెట్టాలనడం హాస్యాస్పదం.ప్రధాని పదవి స్థాయిని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు ఇస్తున్నాం. తెలంగాణ నుంచి రూ.3,65,795 కోట్లు కేంద్రానికి ఇస్తున్నాం. కేంద్రాన్ని, కొన్ని రాష్ట్రాలను ఆదుకుంటున్నామని అక్కడ కేసీఆర్‌ ఫొటో పెట్టాలని అడిగితే ఎలా ఉంటుంది? తెలంగాణ ఇస్తున్నది ఎక్కువ... కేంద్రం మన రాష్ట్రానికి ఇస్తున్నది తక్కువ. కాళేశ్వరం నీటితో రైతులు రెండు పంటలు వేస్తున్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారట్లేదని అమిత్‌షా అసత్యాలు చెబుతున్నారు. భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్‌ అసత్యాలు చెబుతున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా." - హరీశ్​రావు, మంత్రి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.