Flood Damages Estimation: వరదలతో రూ. 6,054 కోట్ల నష్టం... ప్రాథమిక అంచనాలు విడుదల

author img

By

Published : Nov 25, 2021, 11:57 AM IST

Flood Damages Estimation

ఆంధ్రప్రదేశ్​లో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మొత్తం లక్షా 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు(Flood Damages Estimation) తెలిపారు. వాటి మొత్తం నష్టం విలువ రూ .6,054 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో వరద నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా మొత్తం లక్షా 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. వాటి మొత్తం విలువ రూ. 6వేల 54 కోట్లుగా(AP Flood Damages Estimation report) తేల్చారు.

ఇందులో రహదారులు దెబ్బతినటం వల్ల రూ. 1,756 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. చెక్ డ్యాములు, చెరువులు, కాల్వలకు గండి పడటంతో.... సాగునీటి శాఖకు జరిగిన నష్టం రూ. 556 కోట్లుగా నిర్ధారించారు. వ్యవసాయ రంగంలో రూ. 13 వందల 53 కోట్లుగా ఉందని అంచనా వేశారు. పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖలకు మరో రూ. 2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా( flood damage preliminary estimates report) వేశారు.

ఇదీ చదవండి: Annamayya Reservoir Disaster: తెగిన మట్టికట్ట... గూడు పోయి గోడు మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.