Telangana Top News: టాప్ న్యూస్​ @9AM

author img

By

Published : May 15, 2022, 9:01 AM IST

TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • న్యాయాన్ని నిరాకరిస్తే అది అరాచకానికి దారితీస్తుంది

న్యాయాన్ని నిరాకరిస్తే అది అరాచకానికి దారి తీస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి రమణ వ్యాఖ్యానించారు. దేశంలో చాలా న్యాయస్థానాలు శిథిల భవనాల్లో నడుస్తున్నాయని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్​-లద్దాఖ్​ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

  • భాగ్యనగరానికి 65 టీఎంసీల నీటికుండ

హైదరాబాద్ వాసులకు మరో 50 ఏళ్లపాటు నీటి అవసరాలు తీరేలా సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జనానికి ఏదేదో చేస్తామని ఎన్నికల ముందువచ్చి మాయమాటలు చెప్పేనేతల మాటలను నమ్మొద్దని కేటీఆర్ హెచ్చరించారు.

  • స్కానింగ్‌కు ప్రైవేటుకు వెళ్తున్నాం.. మందులూ లేవు

జనగామ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి మందుల దుకాణంలో కనీసం దగ్గు, జ్వరం, జలుబు తదితరాల ఔషధాలు కూడా లేవని మంత్రి ఎదుట పలువురు వాపోగా.. పరిస్థితిని చక్కదిద్దాలంటూ వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • పురోగతిలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల పరిశ్రమ..

ఇంజినీరింగ్‌ పరికరాల తయారీలో తెలంగాణ రోజురోజుకూ పురోగతి సాధిస్తోంది. ఫలితంగా ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి సాధించడంతో ఉపాధి పెరిగింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో దేశవిదేశాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.

  • మర్దన పేరిట స్నేహితురాలిని రప్పించి.. అలా చేయాలంటూ చిత్రహింసలు

మర్దన పేరిట దిల్లీ నుంచి పిలిపించిన స్నేహితురాలిని గదిలో నిర్భందించి చిత్రహింసలు పెట్టిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. బాధితురాలు ఎలాగొలా వారి నుంచి బయటపడి పీఎస్​లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు యువతులను అరెస్టు చేసి రిమాండ్​కి తరలించారు.

  • మార్కులు రాకపోతే పెళ్లి చేస్తారటా.. పాస్​ చేయండి​ సార్

తనని పాస్​ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బోర్డు పరీక్షల్లో రాసింది ఓ విద్యార్థిని. మరో విద్యార్థి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు తనను పాస్​ చేయడంటూ రాశాడు. ఈ వింత జవాబులన్నీ హరియాణాలోని బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో బయటపడ్డాయి.

  • దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

  • 2026 నాటికి చైనాను అధిగమించి రెండోస్థానానికి భారత్​!

రానున్న నాలుగేళ్ల కాలంలో సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ విభాగంలోని అంకురాలు దాదాపు రూ.7.5లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తాయని వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ సంస్థ చిరాటీ వెంచర్స్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సేవల సంస్థ జినోవ్‌ ఉమ్మడి నివేదిక వెల్లడించింది. 2026 నాటికి చైనాను అధిగమించి, రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది.

  • పసిడి వేటలో భారత్‌.. చరిత్ర తిరగరాసేనా?

భారత్‌ ఒకవైపు.. పసిడి మరోవైపు.. మధ్యలో 14సార్లు ఛాంపియన్‌ ఇండోనేసియా! ఈ బలమైన జట్టును ఓడించి భారత్‌ చరిత్ర సృష్టిస్తుందా! బ్యాడ్మింటన్‌లో ఓ సువర్ణాధ్యాయానికి తెరలేస్తుందా? వీటికి సమాధానం తెలియాలంటే నేడు(ఆదివారం) జరగబోయే థామస్‌కప్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ చూడాల్సిందే..

  • లెస్బియన్‌గా మాధురీ దీక్షిత్‌?

తేజాబ్‌, దిల్‌, సాజన్‌, బేటా, హమ్‌ ఆప్కే హై కౌన్‌.. లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో అలరించిన అలనాటి అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌ ప్రస్తుతం ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు 'మజా మా'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.