Telangana News : టాప్ న్యూస్​ @11AM

author img

By

Published : May 12, 2022, 11:00 AM IST

top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఎన్‌జీవోల అనుమతులకు అడ్డదారులపై సీబీ‘ఐ’..

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనల్ని పాటించకుండా స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో)ను కొనసాగించేందుకు అడ్డదారిన అనుమతుల్ని పొందుతున్న వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. ఈ ఎన్జీవోలకు సహకరించిన ఇంటిదొంగలపైనా కొరడా ఝళిపిస్తోంది.

  • చదవడానికి మూడ్ లేదా... అయితే ఇది మీకోసమే

చదవాల్సినవి ఎన్నో ఉంటాయి... మూడ్‌ ఉండదు. పరీక్షలు ముంచుకొస్తున్నా చేత్తో పుస్తకం పట్టుకోవడానికి మూడ్‌ రాదు. ఓపక్క ఇంట్లోవాళ్లు కోప్పడుతున్నా.. సమయం వృథా అవుతున్నా.. అదేంటో మూడ్‌ మాత్రం రాను రానంటుంది. ఇలాంటివాళ్లలో మీరూ ఉన్నారా.. అయితే ఇది మీకోసమే. దీన్ని చదవడానికి కూడా మూడ్‌ లేదనొద్దు ప్లీజ్‌...

  • సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

సైకిల్ కొనివ్వ లేదని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలంలో చోటుచేసుకుంది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • కృత్రిమ కాళ్ల సాయంతో సేద్యం... స్ఫూర్తిగా నిలుస్తున్న యువకుడు

జీవితం చాలా పెద్దది. ఎవరికైనా కష్టాలు సహజం. కానీ ఆ యువకుడి కష్టాలు చెప్పుకోలేనివి. ప్రమాదవశాత్తు వరి నూర్పిడి యంత్రంలో పడి రెండు కాళ్లూ కోల్పోయినా... పట్టుదల, సంకల్ప బలంతో దాన్ని అధిగమిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కుమురం భీం జిల్లాకు చెందిన ఓ యువకుడు.

  • స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం..

ఏపీలోని మచిలీపట్నానికి పశ్చిమంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. కాసేపట్లో తీవ్రవాయుగుండం బలహీనపడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • దేశంలో స్థిరంగా కరోనా కేసులు..

భారత్​లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 2,827 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 24 మంది చనిపోయారు. ఒక్కరోజే 3,230 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • విమానంలో 122 మంది.. టేకాఫ్​ సమయంలో చెలరేగిన మంటలు!

విమానం టేకాఫ్​ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలో జరిగింది.

  • భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు...

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 800 పాయింట్లకుపైగా నష్టంతో 53 వేల 260 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు కోల్పోయి.. 16 వేల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. దేశీయ సూచీల నష్టాలకు కారణంగా తెలుస్తోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో టీసీఎస్​ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

  • వార్నర్​ అదృష్టం... రాజస్థాన్​కు ఎదురుదెబ్బ!

ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం జరిగిన దిల్లీ క్యాపిటల్స్‌-రాజస్థాన్​ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో చాహల్​, వార్నర్​ ఓ రికార్డును సాధించారు. కాగా, ఈ మ్యాచ్​లో విజయం సాధించిన దిల్లీ జట్టు ప్లేయర్​ వార్నర్​ అదృష్టమే రాజస్థాన్​ రాయల్స్‌ కొంపముంచినట్లయింది.

  • 'ఆర్​ఆర్​ఆర్'​ ఓటీటీ రిలీజ్ డేట్​ వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. వాళ్లందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' డిజిటల్‌ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.