Telangana News: టాప్​ న్యూస్​ @1PM

author img

By

Published : May 9, 2022, 12:59 PM IST

TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఈ టెక్నిక్స్‌ ఫాలో అయితే చాలు.. పోలీస్​ జాబ్​ మీదే!

రాష్ట్రంలో ఉన్న నోటిఫికేషన్స్‌లో పోలీస్‌ కానిస్టేబుల్స్‌తోపాటు ఎస్‌ఐ, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, డిప్యూటీ జైలర్స్‌, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మొదలైన అన్ని పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లు) ఒకేవిధంగా ఉంటాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుని సిద్ధమైతే పాసవ్వడం సులువే!

  • ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారం..

కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు ప్రకటించాయి.

  • తీవ్రంగా మారిన 'అసని' తుపాన్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో 'అసని' తుపాను తీవ్రంగా మారింది. దీంతో మంగళవారం ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలుండగా.. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

  • సాగునీటి లభ్యతను బట్టే పంటల మార్పిడి..

నీటి పొదుపుతో పంటలు సాగయ్యేలా ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం సూచించింది. పాలమూరు జిల్లాల రైతులపై అధ్యయనం చేసిన ఈ బృందం.. సాగు తీరు, సాగులో సమస్యలు, ఎకరానికి పండే పంట(ఉత్పాదకత), వస్తున్న ఆదాయం, దిగుబడి, ఆదాయం తగ్గడానికి కారణాలు, రైతుల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు తదితర అనేక అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు.

  • దావూద్​ కేసులో వారికి ఎన్​ఐఏ ఉచ్చు..

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం, అతడి ముఠాకు సంబంధించి వ్యవహారాలపై విచారణ ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు.. ముంబయిలోని సుమారు 20 ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. 'డి' కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

  • షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు..

అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు దర్శనమిచ్చాయి. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • ఫుల్​ స్ట్రెంథ్​తో సుప్రీంకోర్టు!

సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్​ సుధాంశు ధులియా, జస్టిస్​ జంషెడ్​ బి.పర్దీవాలా ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ వారి చేత ప్రమాణం చేయించారు. వారి రాకతో సుప్రీం కోర్టులో పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగినట్లయింది.

  • సరికొత్త 'లాగిన్' దిశగా గూగుల్, యాపిల్!!

ఆఫీస్​ మెయిల్, పర్సనల్ మెయిల్, గూగుల్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా అన్నింటికీ పాస్​వర్డ్స్​ గుర్తుంచుకోవడం కష్టం. అన్ని అకౌంట్స్​కు ఒకటే పాస్​వర్డ్​ వాడదామంటే హ్యాకింగ్ భయం. అసలు పాస్​వర్డ్​ లేకుండానే ఆయా అకౌంట్స్​లోకి లాగిన్​ అయ్యే వీలుంటే? అది కూడా సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా! బాగుంటుంది కదూ!! అందుకే గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్​ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

  • ధోనీ.. క్రీజులోకి వెళ్లేముందు బ్యాట్ ఎందుకు​ కొరుకుతాడంటే?

మైదానంలో క్రీజులోకి వెళ్లేముందు మహేంద్ర సింగ్ ధోనీ ఎందుకు బ్యాట్​ కొరుకుతాడో వివరించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ అమిత్​ మిశ్రా. మరోవైపు.. చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్​, నెట్‌ రన్‌రేట్‌ విషయమై ఆలోచించట్లేదని మహీ చెప్పాడు.

  • సామ్​తో విజయ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​..

క‌శ్మీర్‌లో రౌడీహీరో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. యూనిట్ సభ్యుల సమక్షంలో దేవరకొండ కేక్ కట్ చేశారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంత, నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఈ వేడుకలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.