Telangana News: టాప్​​ న్యూస్​ @ 7AM

author img

By

Published : May 15, 2022, 6:59 AM IST

TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్​ మృతి..

ఆస్ట్రేలియా క్రికెట్​లో షేన్​ వార్న్​ మరణం మరవకముందే మరో దిగ్గజ క్రికెటర్​ మృతిచెందాడు. మాజీ క్రికెటర్​ ఆండ్రూ సైమండ్స్​(46) ఓ కారు ప్రమాదంలో మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

  • ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు..

రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ వేదికగా భాజపా అగ్రనేత, హోమంత్రి అమిత్‌షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఫామ్‌హౌస్‌లోని కూర్చొని తెరాస అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారని... రేపు ఎన్నికలకు వెళ్లినా తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. తన జీవితంలో ఇంతటి అవినీతిమయ సర్కార్‌ను చూడలేదన్న అమిత్ షా.. భాజపాకు అవకాశం ఇస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

  • భాజపా అంటే బక్వాస్ జుమ్లా పార్టీ..

మంత్రి కేటీఆర్ మరోసారి దిల్లీ భాజపా నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మరో పొలిటికల్ టూరిస్ట్​ అంటూ ఎద్దేవా చేశారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ అంటూ ట్విటర్​ ద్వారా విమర్శలు చేశారు.

  • ఆ పోస్టుల దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు..

రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వడంతో పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూ ఉద్యోగ వేటలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తులు లక్ష దాటినట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది.

  • కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులమయం..

రాష్ట్రంలో తెరాస పాలనాతీరుపై రాష్ట్ర భాజపా నేతలు నిప్పులు చెరిగారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన నాయకులు... రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు వెనుకడుగు వేయొద్దని శ్రేణులకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులమయంగా మారిందని భాజపా వస్తేనే ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.

  • అచేతనంగా అమ్మ.. మృతదేహం వద్దే మూడ్రోజులుగా కుమారుడు

ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న తల్లి.. పక్క గదిలో తనలో తాను మాట్లాడుకుంటూ కూర్చున్న కుమారుడు. ఇలా... ఓ గంట కాదు... ఓ రోజు కాదు... మూడ్రోజుల పాటు కళ్లెదుటే అచేతనంగా తల్లి పడి ఉన్నా బిత్తరచూపులతో చూస్తుండటం తప్పా, ఏమీ చేయలేని హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో బయటపడింది.

  • సెల్​ఫోన్​ వినియోగంలో మన పిల్లలే టాప్​!

భారత్‌లో పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం 83 శాతంగా ఉందని కంప్యూటర్‌ భద్రత సాఫ్ట్‌వేర్‌ సంస్థ 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10-14 ఏళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ వినియోగంలో ప్రపంచ సరాసరి కన్నా 7 శాతం అధికంగా ఉందని తాజా సర్వేలో వెల్లడైంది.

  • అణుబాంబు వేయడం ఉత్తమం..

దేశాన్ని దొంగలకు అప్పజెప్పడం కంటే అణుబాంబు వేయడం ఉత్తమం అన్నారు పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం మానేసి, ప్రభుత్వ పనితీరును చక్కదిద్దాలని ఇమ్రాన్‌ హితవు పలికారు.

  • డిపాజిటర్ల చూపు.. ప్రభుత్వ సెక్యూరిటీల వైపు

ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకే ఆసక్తి చూపుతున్నారు డిపాజిటర్లు. అధిక వడ్డీ లభిస్తుండటమే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు 7 శాతానికి మించి ఉండటంతో ఇవి సంప్రదాయ మదుపరులను ఆకట్టుకుంటున్నాయి.

  • ప్రభాస్‌ దృష్టంతా ఆ సినిమాపైనే..

రెబల్​స్టార్​ ప్రభాస్​.. ప్రస్తుతం తన దృష్టి అంతా 'ప్రాజెక్ట్​ కె'పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా దర్శకుడు మారుతీతో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.