MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

author img

By

Published : Nov 9, 2021, 5:08 PM IST

Updated : Nov 9, 2021, 10:34 PM IST

Election code in all joint districts except Hyderabad from today in telangana

రాష్ట్రంలో నిర్వహించే ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections in telangana 2021)కు సంబంధించి.. హైదరాబాద్‌ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల నియమావళి(election code in telangana) అమల్లోకి రానుంది. ఎలాంటి పబ్లిక్‌ మీటింగులు, రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని సీఈఓ శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్(mlc elections in telangana 2021 notification)​ విడుదలైన నేపథ్యంలో.. ఇవాల్టి నుంచే ఎలక్షన్​ కోడ్(election code in telangana)​ అమల్లోకి రానుందని సీఈఓ శశాంక్​ గోయాల్​ ప్రకటించారు. హైదరాబాద్‌ మినహా మిగతా.. 9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు ఇచ్చిన మార్గదర్శకాలే(election code in huzurabad) ఈ ఎలక్షన్స్​కీ వర్తిస్తాయని వివరించారు.

నో పబ్లిక్​ మీటింగ్స్​..

ఎన్నికల నియామావళి(election code in telangana 2021)కి సంబంధించిన మార్గదర్శకాలు ఈసీ వెబ్​సైట్‌లో సవివరంగా అందుబాటులో ఉన్నాయని శశాంక్ గోయల్​​ తెలిపారు. ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్ నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న సీఈఓ... ఎన్నికల ప్రచారం, ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అందరికీ కొవిడ్ టీకాలు వేయాలని చెప్పారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, స్టార్ క్యాంపైనర్లు ఉండరాదని శశాంక్ గోయల్ తెలిపారు.

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు..

స్థానిక సంస్థల కోటాలో 9 జిల్లాల్లో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్, 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ తేదీలను వెల్లడించింది. డిసెంబర్ 10న పోలింగ్.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ పేర్కొంది. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ ,మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి.. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ తెలిపింది.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు..

ఎమ్మెల్యేల కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 17వ తేదీన పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 29న ఉ.9 నుంచి సా.5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చూడండి:

Last Updated :Nov 9, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.