500 కంటే ఎక్కువ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసిన డాక్టర్.జ్ఞానేష్ థాకర్

author img

By

Published : Sep 22, 2021, 5:28 PM IST

gnanesh thakar

ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి అరుదైన మైలురాయిని సాధించారు డాక్టర్.జ్ఞానేష్ థాకర్. కేవలం 3 నెలల్లో 70కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసినందుకుగానూ ప్రముఖ మ్యాగజైన్ “టెంపుల్ క్యాప్సూల్ మ్యాగజైన్” కవర్ పేజీలో ప్రచురించింది.

యశోద ఆస్పత్రుల్లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగానికి చెందిన సీనియర్ హార్ట్-లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్, యశోద హాస్పిటల్స్ డాక్టర్.జ్ఞానేష్ థాకర్, ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి అరుదైన మైలురాయిని సాధించారు. డాక్టర్.జ్ఞానేష్ థాకర్ శిక్షణ కోసం యూఎస్‌ఎకు వెళ్లడానికి ముందు కార్డియోథొరాసిక్ సర్జన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆస్ట్రియా, యుపీఎంసీ, పిట్స్‌బర్గ్, టెంపుల్ యూనివర్సిటీ ఫిలడెల్ఫియాతో సహా గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి కేంద్రాలలో ప్రాక్టీస్ చేశారు. కేవలం 3 నెలల్లో 70కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసినందుకుగానూ అక్కడి ప్రముఖ మ్యాగజైన్ “టెంపుల్ క్యాప్సూల్ మ్యాగజైన్” కవర్ పేజీలో ప్రచురించింది.

gnanesh thakar
డాక్టర్. జ్ఞానేష్ థాకర్

డాక్టర్.జ్ఞానేష్ థాకర్ అప్పటి నుంచి యూఎస్​లో ప్రముఖ డాక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నప్పటికీ... భారతదేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి మార్గదర్శకం వహించడానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో ఒక రోగికి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి డాక్టర్ కూడా జ్ఞానేష్ థాకరే. అప్పటి నుంచి ఆయన తన టీచింగ్ ఆస్పత్రుల్లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. అతి తక్కువ ఇన్వాసివ్ (చిన్న గాటు)తో డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేశారు.

ఈ సందర్బంగా ప్రపంచ స్థాయి ట్రాన్స్‌ప్లాంట్ విభాగం యశోద హాస్పిటల్స్ సొంతం అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్.పవన్ గోరుకంటి తెలిపారు. యశోద ఆస్పత్రులు వైద్యరంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాయని చెప్పారు. కొవిడ్​-19 సమయంలో అత్యధిక సంఖ్యలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడిననట్లు వెల్లడించారు. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా విషమపరిస్థితిలో వచ్చిన 100 కంటే ఎక్కువ కరోనా రోగుల ప్రాణాలు కాపాడి వారి మన్ననలు పొందామన్నారు. కొవిడ్ తగ్గిన తరువాత ఎదురయ్యే సమస్యలకు 24/7 క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, పల్మోనాలజిస్ట్‌లు, అనస్థీటిస్టులు, ఫిజియోథెరపీ, ప్రపంచ స్థాయి నర్సింగ్ సంరక్షణ అందిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: High Court ON Vaccination: 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.