జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరు
Published on: May 10, 2022, 2:11 PM IST |
Updated on: May 10, 2022, 2:52 PM IST
Updated on: May 10, 2022, 2:52 PM IST

జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరు
Published on: May 10, 2022, 2:11 PM IST |
Updated on: May 10, 2022, 2:52 PM IST
Updated on: May 10, 2022, 2:52 PM IST
14:08 May 10
18 మంది నాయకులకు బెయిల్ మంజూరు
జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరైంది. రాష్ట్రంలో గత వారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో ఓయూలో ముఖాముఖికి అనుమతించాలని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆందోళన చేయగా.. బల్మూరి వెంకట్ సహా 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చంచల్గూడా జైల్‌కు తరలించారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఆ 18 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించిన రాహుల్‌గాంధీ.. జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. అధైర్యపడొద్దని... పార్టీ అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు. తెరాస, భాజపాతో పోరాటం ఆపొద్దని.. అండగా తానుంటానని కార్యకర్తలకు రాహుల్ భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి:

Loading...