Free groceries to flood people: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా నిత్యావసరాలు

author img

By

Published : Nov 21, 2021, 8:38 PM IST

ap govt on rains

ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరద బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు(FREE GROCERIES TO PEOPLE) అందించాలని నిర్ణయించింది. సివిల్ సప్లయ్ శాఖ ద్వారా ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆ రాష్ట్ర ప్రభుత్వం(floods in AP) సమీక్షించింది. బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలను(FREE GROCERIES TO PEOPLE) అందించాలని నిర్ణయించింది. భారీ వరదలతో ప్రభావితమైన నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని బాధితులకు సరుకులు అందించాలని నిర్ణయం తీసుకుంది.

వరద బాధితులైన కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు వంటనూనె, కేజీ ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు చొప్పున అందించాలని ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సప్లయ్ శాఖ ద్వారా ఉచితంగా సరకులు పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కలెక్టర్లు పంపిణీ పక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

AP rains deaths 2021 : ఏపీలో ఆ జిల్లాలపై వాయు'గండం'... 28 మంది మృత్యువాత

tirupati floods: జలదిగ్బంధంలో తిరుపతి... తిండిలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.