Amaravati Padayatra: మహా సంకల్పం... అమరావతి రైతుల 'మహా పాదయాత్ర' ప్రారంభం

author img

By

Published : Nov 1, 2021, 1:10 PM IST

Amaravati Padayatra

అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటేందుకు రాజధాని గ్రామాల రైతులు, మహిళలు మహాసంకల్పంతో ముందడుగు(Amaravathi maha Padayatra) వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి(Amaravathi maha Padayatra)నే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పోరాటం తమకోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమ పోరాట పంథా(Amaravathi maha Padayatra)లో మరో అడుగువేశారు. మూడు రాజధానులు, సీఆర్​డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు... వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ఈ ఉదయం 9గంటల 5 నిమిషాలకు ప్రారంభించారు.

సర్వమత ప్రార్థనలు...

అంతకుముందు మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగాలని ప్రార్ధించారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5కోట్ల ప్రజల జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా మహిళలు తెలిపారు. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలిపుతున్నారని ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు.

వివిధ పార్టీల నేతల మద్దతు...

అమరావతి ప్రజల ఆకాంక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. రైతులు, మహిళలతో కలిసి పాదయాత్ర(Amaravathi maha Padayatra)లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కొనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర(Amaravathi maha Padayatra) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. తొలిరోజు గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి పెదపరిమి మీదుగా తాడికొండ వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అమరావతి రైతులు నడవనున్నారు.

ఇదీ చదవండి: Huzurabad by-election results: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే అంతటా చర్చ.. గెలుపు ఎవరిది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.