కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!

author img

By

Published : May 8, 2022, 5:13 PM IST

ONGC NOTIFICATION 2022

ONGC non executive notification: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఓఎన్​జీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి..

ONGC NOTIFICATION 2022: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్​(ఓఎన్​జీసీ)లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న పది నగరాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది ఓఎన్​జీసీ. మొత్తం 922 ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మే 28 వరకు అవకాశం ఉంది. అధికారిక ప్రకటన ఓఎన్​జీసీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.

ఖాళీల వివరాలు

  • మొత్తం ఖాళీలు- 922
  • పోస్టులను ఎఫ్1, ఏ1, డబ్ల్యూ1గా విభజించింది ఓఎన్​జీసీ.

అర్హతలు

  • అన్ని ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 18 ఏళ్లు.
  • గరిష్ఠ వయసు ఉద్యోగాన్ని బట్టి 27 నుంచి 35 మధ్య ఉంది.

విద్యార్హతలు

  • జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్- సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా
  • జూనియర్ డీలింగ్ అసిస్టెంట్- సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా

శాలరీ

  • ఎఫ్1 లెవెల్- రూ.29 వేల నుంచి రూ.98 వేల మధ్య
  • ఏ1 లెవెల్- రూ.26,600 నుంచి రూ.87వేల మధ్య
  • డబ్ల్యూ1 లెవెల్- రూ.24వేల నుంచి రూ.57,500 మధ్య

దరఖాస్తు ఇలా..
• ఓఎన్​జీసీ అధికారిక వెబ్​సైట్​(www.ongcindia.com) లోకి వెళ్లి ఆన్​లైన్ దరఖాస్తు ఫారం నింపవచ్చు.
ఎంపిక ప్రక్రియ
• అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత టైపింగ్, స్కిల్ టెస్టులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు

  • జనరల్, ఓపీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.