నష్టాలతో ముగిసిన మార్కెట్లు- 17,750 దిగువకు నిఫ్టీ

author img

By

Published : Sep 28, 2021, 9:28 AM IST

Updated : Sep 28, 2021, 3:47 PM IST

Stocks Live updates

15:41 September 28

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 410 పాయింట్లు కోల్పోయి 59,667 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 17,748 వద్దకు చేరింది. వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, టైటాన్​, కోటక్ మహీంద్రా షేర్లు లాభాలను గడించాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

14:33 September 28

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా నష్టంతో 59,145 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లకుపైగా తగ్గి 17,599 వద్ద కొనసాగుతోంది.

  • సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా.. పవర్​గ్రిడ్​ మాత్రం రికార్డు స్థాయిలో 4.5 శాతం, ఎన్​టీపీసీ 4.4 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. టైటాన్​, టాటా స్టీల్​, హెచ్​యూఎల్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫినాన్స్​, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

12:52 September 28

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా కోల్పోయి 59,374 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 190 పాయింట్లకుపైగా నష్టంతో 17,663 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. టెలికాం, ఐటీ, బ్యాంకింగ్​ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, టైటాన్​, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫినాన్స్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:35 September 28

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకుపైగా తగ్గి.. 59,895 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 40 పాయింట్లు కోల్పోయి 17,816 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, టైటాన్​, మారుతీ, ఎస్​బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ (జీవనకాల గరిష్ఠం)​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, బజాజ్​ ఫినాన్స్, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 September 28

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు మంగళవారం (Stocks today) ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 90 పాయింట్లకు పైగా కోల్పోయి 59,985 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 15 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో  17,841 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఎస్​బీఐ, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, టీసీఎస్​, ఏషియన్​ పెయింట్స్​ నష్టాల్లో ఉన్నాయి.
Last Updated :Sep 28, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.