ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్వల్పనష్టాలు.. బ్యాంకింగ్​ షేర్లు పతనం

author img

By

Published : Mar 24, 2022, 9:21 AM IST

Updated : Mar 24, 2022, 3:51 PM IST

Stock markets live updates

15:48 March 24

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం సెషన్​లో ఫ్లాట్​గా ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 89 పాయింట్లు కోల్పోయి 57 వేల 596 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ పాయింట్లు 23 పాయింట్లు తగ్గి.. 17 వేల 223 వద్ద సెషన్​ను ముగించింది. నేటి సెషన్​లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లోహం, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్​ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఫ్లాట్​గా ట్రేడయ్యాయి.

13:09 March 24

స్టాక్​ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత స్వల్ప లాభాలు పొందిన సూచీలు.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 245 పాయింట్లు కోల్పోయి 57,439కి పడిపోయింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో 66 పాయింట్ల నష్టంతో 17,179వద్ద కదలాడుతోంది.

11:11 March 24

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు వృద్ధి చెంది 57,770కి చేరింది. నిఫ్టీ 20 పాయింట్లు మెరుగుపడి 17,266 వద్ద ట్రేడవుతోంది.

08:55 March 24

stock markets live updates

Stock market live updates: స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్​ 354 పాయింట్ల నష్టపోయి 57,300కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 17,150 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లపై ప్రభావం చూపుతోంది. ఓఎన్​జీసీ, కోల్ ఇండియా, ఇండాల్గో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్​ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, హీరోమోటార్​ కార్ప్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated :Mar 24, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.