ఆరంభ లాభాలు ఆవిరి.. సెన్సెక్స్​ 300, నిఫ్టీ 70 డౌన్

author img

By

Published : Mar 23, 2022, 3:41 PM IST

Stock markets Close

Stock Markets Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ నష్టాలు నమోదుచేశాయి. తీవ్ర ఒడుదొడుకుల సెషన్​లో సెన్సెక్స్​ 300, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయాయి.

Stock Markets Close: మంగళవారం సెషన్​లో పుంజుకున్న స్టాక్​ మార్కెట్లు మరుసటి రోజు మళ్లీ పడిపోయాయి. ఆరంభంలో సానుకూలంగా కదలాడిన సూచీలు.. కాసేపటికే తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల్లోకి జారుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 304 పాయింట్లు కోల్పోయి 57 వేల 685 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 17 వేల 246 వద్ద సెషన్​ను ముగించింది. తొలుత లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​ ఓ దశలో 420 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 417 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ 420 పాయింట్ల నష్టంతో.. 57 వేల 569 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ​

లాభనష్టాల్లో ఇవే: ఫార్మా, విద్యుత్​ రంగం షేర్లు ఒక శాతం మేర రాణించాయి. ఆటో, బ్యాంకింగ్​, లోహ రంగం సూచీలు నష్టాల్లో ముగిశాయి. వీటిల్లో ఎక్కువగా అమ్మకాలు కనిపించాయి. హిందాల్కో, దివీస్​ ల్యాబ్స్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, టాటా స్టీల్​, యూపీఎల్​ లాభపడ్డాయి. కోటక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, బ్రిటానియా, భారతీ ఎయిర్​టెల్​, సిప్లా డీలాపడ్డాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో సగం కంటే ఎక్కువ షేర్లు పతనమయ్యాయి. మొత్తంగా 1424 షేర్లు ముందుకు దూసుకెళ్లాయి. 1891 షేర్లు పడిపోయాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. బీఎస్​ఈ మిడ్, స్మాల్​ క్యాప్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లోనూ ఫ్లాట్​గా ట్రేడయ్యాయి.

ఇవీ చూడండి: ఫుల్ సెక్యూరిటీ, స్పెషల్ డాక్టర్.. అంబానీ మనవడు స్కూల్​కెళ్తే మామూలుగా ఉండదు!

ఐఓబీ, సీబీఐ ప్రైవేటీకరణ? ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్​ఎస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.