లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 887 ప్లస్

author img

By

Published : Dec 7, 2021, 9:27 AM IST

Updated : Dec 7, 2021, 3:47 PM IST

stock market live updates

15:38 December 07

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు పెద్ద ఎత్తున కొనుగోళ్లు వెల్లువెత్తగా స్టాక్​మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఒమిక్రాన్​ భయాలు ఉన్నప్పటికీ.. బుధవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు సానుకూలంగానే ఉంటాయనే సూచనలు మదుపరుల ఆశలకు ప్రాణం పోశాయి. దీంతో అన్ని రంగాల షేర్లు పెరిగాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ​887 పాయింట్లు లాభంతో 57,634పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 264 పాయింట్ల వృద్ధితో 17,177 వద్ద ముగిసింది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో... ఏషియన్​ పెయింట్స్​ ఒక్కటే నష్టాల్లో ముగిసింది.

14:34 December 07

బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1,109 పాయింట్ల లాభంతో 57,856 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 356 పాయింట్ల లాభంతో 17,238 వద్ద కొనసాగుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఐసీఐసీఐ బ్యాంక్​ సుమారు నాలుగు శాతం మేర లాభపడింది.

11:45 December 07

ఒమిక్రాన్ భయాలతో సోమవారం కుప్పకూలిన మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 889 పాయింట్ల లాభంతో 57,636 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 259 పాయింట్ల లాభంతో 17,171 వద్ద కొనసాగుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఏసియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​, భారతీ ఎయిర్​టెల్​ మినహా అన్నీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బుధవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు సానుకూలంగానే ఉంటాయనే సూచనలతో పాటు, సోమవారం మార్కెట్​ భారీగా కుదేలవడం కారణంగా మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

10:36 December 07

Stock Market Live Updates: దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 741 పాయింట్ల లాభంతో 57,488 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 219 పాయింట్ల లాభంతో 17,131 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. దీంతో ఆసియా సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతుండగా.. దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

పైగా నిన్న భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఏసియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​ మినహా అన్నీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

09:09 December 07

స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు (Stock Market today) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 420 పాయింట్లకుపైగా లాభంతో 57,168 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 129 పాయింట్లకుపైగా పెరిగి 17,041 వద్ద కొనసాగుతోంది.

కిందటి సెషన్​లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగిన కారణంగా... మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

లాభనష్టాలు..

ముప్పై షేర్ల ఇండెక్స్​లో షేర్లన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Dec 7, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.